Supreme Court of India: కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం కోర్టు నోటీసులు !
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం కోర్టు నోటీసులు !
Supreme Court of India: కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. గవర్నర్ల వద్ద పలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. పిటిషన్పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పరిద్వాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర హోంశాఖకు, గవర్నర్ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.
Supreme Court of India…
రాష్ట్రపతికి పంపించాల్సిన బిల్లులపై ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తున్న గవర్నర్ల చర్యను సవాలు చేస్తూ కేరళ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఏడాదికి పైగా ఎనిమిది బిల్లులపై గవర్నర్లు ఆమోదం తెలపకుండా ఆపుతున్నారని, ఆలస్యానికి గల కారణం తెలియజేయట్లేదని రెండు రాష్ట్రాలూ తమ పిటిషన్లలో పేర్కొన్నాయి. దీంతో సుప్రీంకోర్టు గవర్నర్లకు నోటీసులు జారీ చేసింది.
Also Read : CM Chandrababu Naidu : జగన్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరిన సీఎం చంద్రబాబు