Deputy CM Pawan : పింగళి వెంకయ్య ను స్మరించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

కాగా... జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు....

Deputy CM Pawan : భారత జాతీయ జెండా రూపకర్త, తెలుగు జాతి ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహినీయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్మరించుకున్నారు. పింగళి వెంకయ్య అందించిన స్ఫూర్తిని జాతి మరువదన్నారు. ఈ రోజు పింగళి వెంకయ్య జయంతి అని… ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో మన దేశానికి ఒక కేతనం ఉండాలనే తపనతో వెంకయ్య మువ్వన్నెలతో పతాకాన్ని తీర్చిదిద్దారన్నారు. ఆ జెండా నాడు, నేడు, ఎన్నడూ మన కీర్తి కేతనంగా ఎగురుతూనే ఉంటుందన్నారు. ఆ జెండాకు సెల్యూట్ చేసిన ప్రతిసారి పింగళి వెంకయ్య స్ఫురణకు వస్తూనే ఉంటారని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan) పేర్కొన్నారు.

Deputy CM Pawan Comment

కాగా… జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎన్నో జాతీయ పతాకాలు వినియోగించారు. కానీ, పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తించారు. 1921 మార్చి 31 ఏప్రిల్ 1 వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఈ జాతీయ పతాకాన్ని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ పతకానికి కొద్దిగా మార్పులు చేర్పులు చేశారు. గాంధీజీ సూచన మేరకు దానిపై ‘రాట్నం’ గుర్తు చేర్చారు. అయితే స్వాతంత్య్రానంతరం పండింట్ జవహర్ లార్ నెహ్రూ ఇచ్చిన సూచనల మేరకు రాట్నం స్థానంలో అశోకచక్రాన్ని చేర్చారు. స్వాత్రంత్య దినోత్సవం, గణతంత్రదినోత్సవం నాడు దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది.

Also Read : Rahul Gandhi: నాపై దాడులకు ఈడీ సిద్ధమవుతోంది – రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణ

Leave A Reply

Your Email Id will not be published!