Kamala Harris : అధ్యక్షుడు జో బైడెన్ ను పొగుడుతూ ప్రసంగించిన కమలా హ్యారిస్

ఈ మేరకు చికాగోలో జరిగిన డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో కమలా హ్యారీస్ మాట్లాడారు...

Kamala Harris : అమెరికా వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ‘డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్’లో సంప్రదాయానికి విరుద్ధంగా ఆశ్చర్యకర ప్రసంగం చేశారు. సాధారణంగా అధ్యక్ష అభ్యర్థి కన్వెన్షన్ చివరి రోజున ప్రసంగం చేస్తారు. కానీ అందుకు విరుద్ధంగా మొదటి రోజునే మాట్లాడిన కమలా హ్యారీస్‌.. అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అమెరికాకు జీవితాంతం సేవ చేసిన అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బైడెన్‌కు తాను ఎన్నటికీ రుణపడి ఉంటానని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు చికాగోలో జరిగిన డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో కమలా హ్యారీస్(Kamala Harris) మాట్లాడారు.

Kamala Harris Comment

‘‘ మన అద్భుతమైన అధ్యక్షుడు జో బైడెన్‌ గురించి మాట్లాడడం ద్వారా ఈ సమావేశాలను ప్రారంభించాలనుకుంటున్నాను. జో.. మీ చారిత్రాత్మక నాయకత్వానికి, దేశానికి జీవితాంతం సేవ అందించిన మీకు ధన్యవాదాలు. మేమంతా మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం’’ అని కమలా హ్యారీస్ అన్నారు. సాధారణంగా అధ్యక్ష అభ్యర్థి కన్వెన్షన్ చివరి రోజున ప్రసంగిస్తారు. కానీ హ్యారిస్ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఆశ్చర్యకరంగా తొలి రోజే మాట్లాడారు. దీంతో సభా ప్రాంగణం మొత్తం కమలా హ్యారీస్ నినాదాలతో మార్మోగింది. మరోవైపు పార్టీ సమావేశ ప్రాంగణంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. కాగా డెమొక్రాటిక్ పార్టీ నామినీగా అధికారికంగా ఈ సమావేశాల్లో ఆమోదించనున్నారు.

ఈ సమావేశానికి దేశంలోని అన్ని మూలల నుంచి ప్రజలు వచ్చారని, సమాజంలోని విభిన్న వర్గాలకు చెందినవారు ఇక్కడకు విచ్చేశారని, ఈ నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని డెమొక్రాటిక్ పార్టీ శ్రేణులకు కమలా హ్యారీస్(Kamala Harris) పిలుపునిచ్చారు. ఒకే స్వరంతో ముందుకు వెళ్లాలని, ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని అన్నారు. ‘‘ పోరాడితే.. మనమే గెలుస్తాం’’ అని కమలా హ్యారీస్ అన్నారు.కాగా డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ ఆగస్టు 22న ముగియనుంది. నాలుగు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల ముగింపులో అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారీస్, మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా డెమొక్రాటిక్ పార్టీ అధికారికంగా ఆమోదించనుంది. ఈ సమావేశాల్లో అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ కూడా ప్రసంగించనున్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయిన హిల్లరీ క్లింటన్‌ కూడా ప్రసంగించనున్నారు. ఆమెను ఈ సమావేశాల్లో డెమొక్రాట్లు సన్మానించనున్నారు.

Also Read : MLC Kavitha Bail : నేడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత బెయిల్ పై సుప్రీంలో విచారణ

Leave A Reply

Your Email Id will not be published!