MLC Kavitha Health : తీహార్ జైల్లో అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ కవిత

ఆ తరువాత సీబీఐ సైతం ఆమెను కస్టడీలోకి తీసుకుంది...

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు తీహార్ జైలు అధికారులు. కాసేపటి క్రితమే ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యలు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు వైద్య పరీక్షల నిమిత్తం కవితను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలోనూ ఆమెను ఎయిమ్స్‌కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

MLC Kavitha Health Condition

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత సీబీఐ సైతం ఆమెను కస్టడీలోకి తీసుకుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థల కేసుల్లో కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోసం ఇప్పటికే అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసినా.. ఈడీ ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈసారైనా ఆమెకు బెయిల్ వస్తుందని కవిత, ఆమె కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Also Read : CM Chandrababu : అచ్యుతాపురం ఎస్సెన్స్ కంపెనీ ఘటనపై పరామర్శకు విశాఖ చేరుకున్న సీఎం

Leave A Reply

Your Email Id will not be published!