President Murmu : కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై తొలిసారి స్పందించిన రాష్ట్రపతి

అకృత్యాల‌కు ఏ నాగ‌రిక స‌మాజం కూడా త‌మ కూతుళ్లు, సోద‌రీమ‌ణుల‌ను బ‌లి ఇవ్వదు...

President Murmu : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి స్పందించారు. ఈ ఘటన తనకు తీవ్ర ఆవేదనను, భయాన్ని కలిగించిందన్నారు. ఇక జరిగింది చాలు…అని పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని అన్నారు. అక్కాచెల్లెళ్లు, కుమార్తెలు ఇలాంటి అఘాయిత్యాలకు గురికావడాన్ని ఏ నాగరిక సమాజం అనుమతించదని చెప్పారు.

President Murmu Comment

”ఒకవైపు విద్యార్థులు, డాక్టర్లు, పౌరులు కోల్‌కతాలో నిరసనలు చేపడుతుంటే మరోవైపు నేరస్థులు మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. అకృత్యాల‌కు ఏ నాగ‌రిక స‌మాజం కూడా త‌మ కూతుళ్లు, సోద‌రీమ‌ణుల‌ను బ‌లి ఇవ్వదు. ఇలాంటి నీచమైన ఘటనల విషయంలో స‌మాజం త‌న‌ను తాను ఆత్మప‌రిశీల‌న చేసుకోవాలి. నిర్భయ ఘ‌ట‌న జ‌రిగిన 12 ఏళ్ల కాలంలో స‌మాజం ఎన్నో అత్యాచార ఘ‌ట‌న‌ల‌ను మ‌రిచిపోయింది. ఇటువంటి సామూహిక మ‌తిమ‌రుపు అసహ్యకరమైనది. గ‌త త‌ప్పుల‌ను ఎదుర్కొనేందుకు స‌మాజం భ‌య‌ప‌డుతోంది. కానీ ఇప్పుడు చ‌రిత్రను స‌మూలంగా మార్చేందుకు సమ‌యం ఆస‌న్నమైంది. స‌మగ్రమైన రీతిలో ఈ స‌మస్యను నిర్మూలించేందుకు ప్రయత్నిద్దాం” ఆమె పేర్కొన్నారు.

Also Read : YSRCP : వరుస రాజీనామాలతో గందరగోళంగా మారిన జగన్ పార్టీ

Leave A Reply

Your Email Id will not be published!