Gautam Adani : ఆస్తుల పరంగా ముఖేష్ అంబానీ స్థానాన్ని దాటేసిన గౌతమ్ అదానీ
గత సంవత్సరంతో పోలిస్తే 95 శాతం మేర సంపద వృద్ధి చెందింది...
Gautam Adani : అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ సంపద రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీని దాటేసింది. ‘ హురున్ ఇండియా -2024’ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ(Gautam Adani) అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం రూ.11.6 లక్షల కోట్లతో తొలి స్థానంలో నిలిచారు. 2020 సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ నాలుగవ స్థానంలో నిలిచారు. అయితే గత ఏడాది కాలంలో అదానీ(Gautam Adani) సంపద విలువ ఏకంగా 95 శాతం పెరిగింది. దీంతో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో గౌతమ్ అదానీ సంపద విలువ భారీగా క్షీణించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత క్రమంగా ఆస్తి వృద్ధి చెందింది.
గత సంవత్సరంతో పోలిస్తే 95 శాతం మేర సంపద వృద్ధి చెందింది. భారత్‌లో టాప్ -10 సంపన్నులలో అత్యధిక ఆస్తి విలువ పెరుగుదల ఇదేనని హురున్ రిచ్ లిస్ట్ రిపోర్ట్ పేర్కొంది. అదానీ గ్రూపునకు చెందిన అన్ని కంపెనీల షేర్ల విలువ గతేడాది గణనీయంగా పెరిగింది. ఉదాహరణగా అదానీ పోర్ట్స్ స్టాక్‌ను తీసుకుంటే ఈ స్టాక్ ఏకంగా 98 శాతం మేర వృద్ధి చెందింది. అదానీ ఎనర్జీ, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పవర్ షేర్లు కూడా గణనీయంగా పెరిగాయి. అంతేకాదు అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ వంటి కీలక స్టాక్‌ల అంచనాలు ఈ ఏడాది సానుకూలంగా ఉన్నాయని హురున్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది.
Gautam Adani…
కాగా మొత్తం రూ.10.14 లక్షల కోట్ల సంపదతో ముకేశ్ అంబానీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. జులై 31, 2024 నాటికి ఉన్న సంపదను పరిగణనలోకి తీసుకున్నట్టు కంపెనీ వివరించింది. ఇక దేశంలో బిలియనీర్ల సంఖ్య రికార్డు స్థాయిలో 334కు చేరుకుందని రిపోర్ట్ పేర్కొంది.
2024లో సంపన్న భారతీయ లిస్ట్ ఇదే..
1. గౌతమ్ అదానీ, ఫ్యామిలీ – రూ.1,161,800 కోట్లు
2. ముకేశ్ అంబానీ, ఫ్యామిలీ – రూ.1,014,700 కోట్లు
3. శివ్ నడార్, ఫ్యామిలీ (హెచ్‌సీఎల్) – రూ.314,000 కోట్లు
4. పూనావాలా ఫ్యామిలీ(సీరం ఇన్స్టిట్యూట్) – రూ.289,800 కోట్లు
5. దిలీప్ షంఘ్వీ (సన్ ఫార్మా) – రూ.249,900 కోట్లు.
కాగా సంపన్నుల జాబితాపై హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనస్ రెహమాన్ జునైద్ మాట్లాడారు. ఆసియా సంపద సృష్టి కేంద్రంగా మారుతోందని అన్నారు. చైనా బిలియనీర్ల సంఖ్య 25 శాతం మేర తగ్గినప్పటికీ.. ఇండియాలో 29 శాతం మేర పెరుగుదల ఉందని ఆయన తెలిపారు. గతేడాది భారత్ ప్రతి ఐదు రోజులకు ఒక బిలియనీర్‌ను ఉత్పత్తి చేసిందని, 2023లో దేశంలో 259 మంది కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారని అన్నారు. కాగా హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 1,500 కంటే ఎక్కువ మంది వ్యక్తులు రూ.1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నికర ఆస్తి కలిగిన వారి సంఖ్య గత ఏడేళ్లతో పోలిస్తే ఏకంగా150 శాతం మేర పెరిగింది.
Also Read : Mukesh Ambani : రిలయన్స్ ఏజీఎం సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన అంబానీ