Air India Fight: ఢిల్లీ-విశాఖపట్నం ఎయిర్‌ఇండియా విమానానికి బాంబు బెదిరింపు !

ఢిల్లీ-విశాఖపట్నం ఎయిర్‌ఇండియా విమానానికి బాంబు బెదిరింపు !

Air India: ఢిల్లీ-విశాఖపట్నం ఎయిర్‌ఇండియా(Air India) విమానానికి మంగళవారం అర్ధరాత్రి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. విమానంలో బాంబు ఉందని తొలుత ఢిల్లీ పోలీసులకు బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో వెంటనే విశాఖపట్నం విమానాశ్రయం అధికారులకు వారు సమాచారం అందించారు. దీనితో రంగంలోనికి దిగిన విశాఖపట్నం విమానాశ్రయం అధికారులు అప్రమత్తం అయ్యారు. 107 మందితో ప్రయాణించిన విమానం షెడ్యూల్‌ ప్రకారం విశాఖపట్నంలో రాత్రి 8.55 గంటలకు ల్యాండ్‌ అయింది. విమానం ల్యాండ్‌ అయి ప్రయాణికులందరు దిగిన తర్వాత బాంబ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించామని, అందులో పేలుడు పదార్ధాలేవీ లేవన్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయిందని విశాఖపట్నం విమానాశ్రయం అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ బెదిరింపు ఆకతాయిలు చేసిన పనిగా అధికారులు తేల్చారు.

Air India Flight Got Bomb…

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు, విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని విమానాశ్రయంతో పాటు దేశవ్యాప్తంగా 41 విమనాశ్రయాలకు బాంబులు అమర్చినట్లు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీనితో రంగంలోనికి దిగిన అధికారులు అవి ఫేక్ అని తేల్చాయి. ఎంటర్‌టైన్మెంట్‌ కోసం 13ఏళ్ల బాలుడు ఎయిర్ కెనడా విమాన బెదిరింపు ఈమెయిల్‌ను పంపినట్లు అధికారులు గుర్తించారు. చెన్నై- దుబాయ్‌ విమానానికీ బాంబు బెదిరింపు రాగా… క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన అనంతరం ఫేక్ అని తేల్చారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళాల్సిన ఇండిగో విమానానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి.

Also Read : Shivaji Statue: ఛత్రపతి శివాజీ విగ్రహం కాంట్రాక్టర్‌ పై లుక్‌అవుట్‌ నోటీసులు !

Leave A Reply

Your Email Id will not be published!