AP Home Minister : గండి కొట్టడానికి గేట్లు ఎత్తడానికి తేడా తెలియని వ్యక్తి మాజీ సీఎం
కాగా... విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతోంది...
AP Home Minister : బుడమేరులో గండ్లు పడిన ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత(AP Home Minister) గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ… గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే విజయవాడ ముంపుకు గురయిందని విమర్శించారు. బుడమేరులో సిల్ట్ తీసిన మట్టిని కూడా వైసీపీ నాయకులు తీసుకువెళ్లారన్నారు. రేపు మధ్యాహ్నానికి మూడు గంటలకు ఎట్టి పరిస్థితుల్లో పూడ్చివేస్తామని స్పష్టం చేశారు. గతంలో 5000 క్యూసెక్కులు ఉన్న బుడమేరు డైవర్షన్ కాల్వ కెపాసిని 15 వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు.విజయవాడ నగరం ముంపుకు కారకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
బుడమేరు గండ్లు పూడిస్తేనే విజయవాడకూ ముంపు తగ్గుతుందన్నారు. మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు బుడమేరు పనులను ఎప్పటికప్పుడు డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నారన్నారు. బుడమేరులో డీసిల్టింగ్‌కు తీసిన మట్టిని బుడమేరు కట్టలను పట్టిష్టం చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. బుడమేరు మట్టితో కూడా జగన్ మోహన్ రెడ్డి అనుచరులు వ్యాపారం చేశారని మండిపడ్డారు. గండి పడటానికి గేట్లు ఎత్తడానికి కూడా జగన్‌కు తేడా తెలియటం లేదంటూ హోంమంత్రి వంగలపూడి అనిత(AP Home Minister) ఎద్దేవా చేశారు.
AP Home Minister Anitha Comments..
కాగా… విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతోంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడుస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి తెల్లవారులు దగ్గర ఉండి పనులు చేయిస్తున్నారు. మళ్లీ బుడమేరకు వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శరవేగంగా గండ్ల పూడుస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులను సమీక్షిస్తున్నారు.
మరోవైపు బుడమేరు ముంచెత్తడంతో 5 నుంచి 8 అడుగుల వరద నీటిలో మునిగిన అజిత్ సింగ్‌నగర్, పాయకాపురం తదితర ప్రాంతాల్లో దాదాపు 80 శాతం ముంపు నుంచి బయటపడ్డాయి. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేస్తున్నారు. అయితే ఇళ్లలో బురద మేట వేయడంతో దాన్ని శుభ్రం చేసుకునేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ఏకంగా ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 48 ఫైర్ ఇంజన్లను తెప్పించారు.వాటిద్వారా వీధుల్లో, ఇళ్లలోకి చేరిన బురద, మురుగు కొట్టేస్తున్నారు.
Also Read : Vinayaka Chavithi : మరికొన్ని గంటల్లో ముస్లిం దేశాల్లో పూజలందుకోనున్న గణపయ్య