Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి నిరాశ కలిగించిన రౌస్ అవెన్యూ కోర్ట్
అయితే సీబీఐ వాదనలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. "లిక్కర్ స్కాం పేరు చెబుతూ....
Delhi CM Kejriwal : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకు పొడగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయించింది. గతంలో మంజూరైన జ్యుడీషియల్ కస్టడీ గడువు నేటితో ముగిసింది. దీంతో కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టులోని స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ముందు హాజరయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేసి కేజ్రీవాల్(Delhi CM Kejriwal) నేరపూరిత కుట్రలో భాగస్వామి అయ్యారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన తాజా చార్జిషీట్‌లో ఆరోపించింది. 2021 మార్చిలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా నేతృత్వంలో పాలసీని రూపొందించారని, దానికి కేజ్రీవాల్ మద్దతుగా నిలిచారని సీబీఐ పేర్కొంది.
Delhi CM Kejriwal Case..
అయితే సీబీఐ వాదనలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. “లిక్కర్ స్కాం పేరు చెబుతూ.. నిందితుల నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా రికవరీ ఎందుకు చేయలేదు? 500 మంది సాక్ష్యులను విచారించి, 50 వేల పేజీల పత్రాలను దాఖలు చేసినప్పటికీ, ఏ ఒక్క ఆప్ నాయకుడు అవినీతి చేసినట్లు నిరూపించలేదు” అని పార్టీ ఓ ప్రకటనలో విమర్శించింది. కాగా, ఇదే కేసులో ఆప్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు సెప్టెంబర్ 11న బెయిల్ మంజూరైంది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేజ్రీవాల్(Delhi CM Kejriwal)తోపాటు దుర్గేష్ పాఠక్‌కు సమన్లు పంపింది. ఈ సమన్లపై స్పందించిన ఎమ్మెల్యే ఇవాళ కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు.
అనంతరం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఆ తరువాత జులైలో సీబీఐ ఆయన్ని మరోసారి అదుపులోకి తీసుకుంది. అయితే ఈడీ కేసులో సుప్రీంకోర్టు జులై 12న ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో మాత్రం ఇంకా జైల్లోనే కొనసాగుతున్నారు. ఆగస్టు 27, సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 11 వరకు ఆయనకు జ్యూడీషియల్ కస్టడీ గడువు పొడిగించారు. తాజాగా మరోసారి గడువు పొడగింపుతో కేజ్రీకి నిరాశ ఎదురైంది. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే మనీష్ సిసోదియా, కల్వకుంట్ల కవిత తదితరులు బెయిల్‌పై బయటకి వచ్చారు.
Also Read : Minister Bandi Sanjay : తెలంగాణ మాజీ సీఎంపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి