Purandeswari: వంద రోజుల పాలనలో మౌలిక సదుపాయాల కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు !
వంద రోజుల పాలనలో మౌలిక సదుపాయాల కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు !
Purandeswari: కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం చేస్తోందని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జాబితా ప్రకారం మూడు విడతలుగా రూ.6 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఠంచనుగా అన్నదాతల ఖాతాల్లో రూ.6 వేలు జమ చేస్తున్నామన్నారు. గడిచిన ఐదేళ్లలో రైతులకు రూ.3 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరిందని చెప్పారు. 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో రైతులకు పెట్టుబడుల బాధలు తీరాయన్నారు.
Purandeswari Comment
కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలపై దృష్టి సారించి పెంచిందని చెప్పారు. సహకార రంగం పునరుజ్జీవానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. భాజపా వంద రోజుల పాలనలో మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మౌలిక సదుపాయాల కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. 8 కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు పురందేశ్వరి చెప్పారు.
Also Read : TJR Sudhakar Babu: ఆంధ్రప్రదేశ్ హత్యలకు నిలయంగా మారింది!