MLA Harish Rao : 2 లక్షల రుణమాఫీ పూర్తయేంతవరకు సీఎంని నిద్రపోనియాను
రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు నేను నిద్రపోను, రేవంత్ రెడ్డిని నిద్రపోనీయను...
Harish Rao : నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు రైతులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా లో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..
Harish Rao Comments
- రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు నేను నిద్రపోను, రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని నిద్రపోనీయను.
- రైతుబందు కేసీఆర్ హయంలో నాట్లకు అందిస్తే, ఈ ప్రభుత్వం పంట కోతకు వచ్చినా రైతుబందు రాలేదు.
- కాంగ్రెస్ హయంలో దొంగరాత్రి కరెంట్ ఇస్తుంది.. కేసీఆర్ కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు.
- కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంటు వచ్చింది.. ఇప్ప్పుడు ఎందుకు వస్తలేదు..
- కరోనా సమయంలోనూ రైతు బంధు టైంకు ఇచ్చినం.
- వీళ్ళకేం పుట్టింది ఇప్పుడు.. కోతలు కొస్తున్నా రైతు బందు రావడం లేదు.
- రేవంత్ రేడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి..
- ఈ వానాకాలం రూ. 7,500 లేదు.. గతంలో ఇచ్చిన రూ. 5 వేలు లేదు.
- రైతు బంధు ఇవ్వకుండా రైతుల్ని అప్పుల పాలు చేస్తున్నారు.
- కుంటిసాకులు, అబద్దాలతో కాలం గడుపుతున్నారు.
- కేసీఆర్ 11 సార్లు టైంకు రైతు బంధు ఇచ్చిండు… వడ్లు కొంటే మూడు రోజుల్లో పైసలు వేసిండు..
- రైతు విలువ, రైతు భూమి విలువ పెంచిండు..
- కాంగ్రెస్ వచ్చింది.. రైతు విలువ తగ్గింది.. భూమి విలువ తగ్గింది..
- కాళేశ్వరం కూలిపోయింది అంటున్న రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వచ్చి రంగనాయకసాగర్, మాల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ చూడాలి.
- కాళేశ్వరంలో వంద బాగాలు ఉంటాయి.. అందులో ఒక్క భాగంలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం పోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు..
- కేసీఆర్ వచ్చి కాళేశ్వరం కట్టినంక రెండు పంటలు రైతులు పండిస్తున్నారు.
- రెండు లక్షల మాఫీ, వడ్లకు బోనస్ అన్నారు.. వచ్చిందా…
- ఇప్పుడు సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
- ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్ అని, ఇప్పుడు సన్నాలు అంటున్నారు..
- రైతుమాఫీపై తొలి సంతకం అన్నావు.
- రుణమాఫీ పూర్తిగా చేస్తే రాజీనామా చేస్తా అన్నా.. నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే రైతులకు మేలు జరగడం నాకు సంతోషం అన్నా…
- సవాల్‌కు సై అన్నారు.. 15 ఆగస్టుకు మాఫీ చేస్తే ఇంత మంది వచ్చేవారా..
- రూ. 31 వేళ కోట్ల నుంచి రూ.18 వేళ కోట్లకు వచ్చింది..
- రుణమాఫీ అయింది తక్కువ, కానోళ్ళూ ఎక్కువ…
- ఎడుపన్నావు హరీష్ అంటే, నీ గుండెల్లో ఉన్నా అని చెప్పిన..
- రుణమాఫీ అయ్యేదాకా నీ వెంట పడత..
- హైదారాబాద్‌లో కూర్చుని మస్తు మాటలు చెబుతున్నరు.
- ఎనుముల రేవంత్ రెడ్డి.. ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారారు.
- పండగ లోపు రుణమాఫీ చేయకుంటే రైతులంతా హైదారాబాద్‌కు వచ్చి సెక్రటేరియట్ ముట్టడిస్తామని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు.
Also Read : Minister Ponguleti : మంత్రి పొంగులేటి ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు