CM Chandrababu : రేపు ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న బాబు
ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు...
CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల(Tirumala)కు బయలుదేరతారు. రాత్రి 9 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు.
CM Chandrababu Will Visit
కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్రవారం జరిగే ధ్వజారోహణం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఉండవల్లి నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేసుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 5.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటారు. పద్మావతి అతిథిగృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని రాత్రి 7.40 గంటలకు బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మాఢవీధుల్లో జరిగే పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. రాత్రి 9.20 గంటలకు పద్మావతి అతిథిగృహం చేరుకుని రాత్రికి అక్కడే బసచేస్తారు. శనివారం ఉదయం 7.35 గంటలకు పాంచజన్యం వెనుక నిర్మించిన వకుళమాత నూతన కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారు. అనంతరం 9 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తారు.
కాగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. దీనిలో భాగంగా ఈరోజు సాయంత్రం ఆలయంలో సేనాధిపతిని సుందరంగా అలంకరించి విశేష సమర్పణ కావిస్తా రు. అనంతరం రాత్రి 7 గంటలకు మాడవీధులగుండా ఊరేగింపు నిర్వహిస్తా రు. తర్వాత రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. యాగశాలలో అర్చకస్వాములు కైంకర్యాలు నిర్వహించి అంకురార్పణ(బీజవాపం) నిర్వహిస్తా రు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ఇక, శుక్రవారం సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి పెద్దశేషవాహనాలతో వాహన సేవలు ప్రారంభంకానున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కంకణ భట్టాచార్యులుగా గోవిందాచార్యులు వ్యవహరిస్తారు.
Also Read : MP Avinash : కూటమి ప్రభుత్వం పై కడప ఎంపీ అవినాష్ విసుర్లు