Minister Konda Surekha : మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ
నేను చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డా. కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు...
Konda Surekha : నాగ చైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. సమంత- అక్కినేని కుటుంబాలు మంత్రి తీరును తప్పు పట్టారు. దాంతో కొండా సురేఖ వెనక్కి తగ్గి.. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మంత్రి కేటీఆర్ విషయంలో కాదని స్పష్టం చేశారు. కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టనని తేల్చి చెప్పారు. ఇటీవల మెదక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ(Konda Surekha)కు ఎంపీ రఘునందన్ రావు నూలు పోగుల దండ వేశారు. దానిని బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేసింది. ఇదే అంశంపై కేటీఆర్, హరీశ్ రావుపై కొండా సురేఖ మండిపడ్డారు. ఆ ఘటనపై హరీశ్ రావు స్పందిస్తూ క్షమాపణ చెప్పారు. కేటీఆర్- కొండా సురేఖ మధ్య జరుగుతోన్న మాటల యుద్ధంలో చైతన్య- సమంత పేర్లు రావడంతో దుమారం చెలరేగింది. సురేఖ క్షమాపణ చెప్పినప్పటికీ మీడియా ముందకు వచ్చి సారీ చెప్పాలనే డిమాండ్ వస్తోంది.
Konda Surekha Comments…
‘‘నేను చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డా. కేటీఆర్(KTR) విషయంలో వెనక్కి తగ్గేది లేదు. కేటీఆర్ చేసిదంతా చేసి దొంగే దొంగ అని అరిచినట్లుంది. పరువునష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటా. నాకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు. నానుంచి అనుకోకుండా ఒక కుటుంబం పేరు వచ్చింది. ఆ కుటుంబం ట్వీట్ చూశాక చాలా బాధపడ్డాను. నేను పడిన బాధ.. అవమానం ఇంకొకరిపై పడకూడదనే వెనక్కి తీసుకున్నా. కేటీఆర్ నాకు క్షమాపణ చెప్పాల్సిందే’’ అని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖకు పీసీపీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫోన్ చేశారు. నాగచైతన్య, సమంత వివాద వ్యాఖ్యలపై కొండా సురేఖతో ఫోన్లో మాట్లాడారు.
వివరణ ఇవ్వాలని కొండా సురేఖను మహేశ్‌గౌడ్ సూచించారు. మాజీమంత్రి కేటీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడారు, ఆవేదనతోనే విమర్శలు చేశానని మహేశ్‌గౌడ్‌కు తెలిపారు. నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోండి.. నా పేరును మీ రాజకీయ పోరాటాలకు వాడకోకండి.. అంటూ మంత్రి కొండా సురేఖ(Konda Surekha)కు సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్‌ని ఉద్దేశిస్తూ అక్కినేని ఫ్యామిలీతో ముడిపెడితూ.. కొండా సురేఖ సమంత విడాకుల గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలను కింగ్ నాగార్జున తీవ్రంగా ఖండిస్తూ.. అబద్దాలుగా కొట్టిపారేశారు. తాజాగా సమంత కూడా ఇన్‌స్టా వేదికగా మంత్రికి సమాధానమిచ్చింది. సమంత తన పోస్ట్‌లో ఏం చెప్పిందంటే…
‘‘స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పని చేయడానికి, స్త్రీలను ఆసరాగా భావించే ఆకర్షణీయమైన పరిశ్రమలో మనుగడ సాగించడానికి, ప్రేమలో పడటానికి మరియు ప్రేమలో నుంచి బయట పడటానికి, ఇంకా నిలబడి పోరాడటానికి.. వీటన్నింటికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి దీనిని చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటకు చాలా వ్యాల్యూ ఉంటుందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. విషయాలను ప్రైవేట్‌గా ఉంచాలనే మా ఎంపిక తప్పుగా సూచించడాన్ని ఆహ్వానించను. నా విడాకులు పరస్పర అంగీకారం మరియు సామరస్యపూర్వకంగా జరిగాయి. ఇందులో ఎటువంటి రాజకీయ కుట్రకు ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను, అలానే కొనసాగించాలనుకుంటున్నాను..’’ అంటూ సమంత పోస్ట్‌లో పేర్కొంది.
Also Read : Telangana Govt : డిజిటల్ కార్డుల కోసం నేటి నుంచి ఇంటింటి సర్వే…