PM Modi-Tata : రతన్ టాటా మృతిపై సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ..

దీంతోపాటు అనేక మంది నిపుణులను, యువ విద్యార్థులను ప్రేరేపించారని గుర్తు చేశారు...

PM Modi : భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల దేశవ్యాప్తంగా అనేక మంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సహా దేశంలోని పలువురు పారిశ్రామిక ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రతన్ టాటా విషాద మరణంతో భారతదేశ కార్పొరేట్ అభివృద్ధికి దేశ నిర్మాణం, శ్రేష్ఠతను మిళితం చేసిన ఐకాన్‌ను కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆయన టాటా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లారని, దానికి మరింత ప్రభావవంతమైన ఉనికిని అందించారని ప్రస్తావించారు.

PM Modi Deepest Coldolences to tata..

దీంతోపాటు అనేక మంది నిపుణులను, యువ విద్యార్థులను ప్రేరేపించారని గుర్తు చేశారు. ఈ క్రమంలో దాతృత్వానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి, టాటా గ్రూప్‌లోని మొత్తం బృందానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రతన్ టాటా మృతికి సంతాపంగా మహారాష్ట్ర, జార్ఖండ్ సహా పలు రాష్ట్రాలు గురువారం ఒకరోజు సంతాప దినాలు ప్రకటించాయి. రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార నాయకుడని, దయగల అసాధారణ వ్యక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలలో ఒకదానికి స్థిరమైన నాయకత్వాన్ని అందించారని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యం, జంతు సంరక్షణ వంటి అనేక అంశాలకు మద్దతు ఇవ్వడంలో ఆయన ముందున్నారని తెలిపారు. ఇదే సమయంలో ఆయన సహకారం, వినయం, దయతో మన సమాజాన్ని మెరుగుపరచాలనే అచంచలమైన నిబద్ధతకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు ప్రధాని మోదీ.

Also Read : Anand Mahindra : రతన్ టాటా మృతి నమ్మలేకపోతున్నా అంటూ ట్వీట్ చేసిన మహీంద్రా అధినేత

Leave A Reply

Your Email Id will not be published!