Noel Tata : టాటా బోర్డు చైర్మన్ గా ఎన్నికైన ‘నోయెల్ టాటా’

అయితే రతన్ టాటా వివాహం చేసుకోలేదు. దాంతో ఆయన వారసుడు ఎవరనే ఓ చర్చ సైతం సాగింది...

Noel Tata : టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా నోయెల్ టాటా ఎన్నికయ్యారు. నోయెల్ టాటాను ట్రస్ట్ బోర్డ్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ వైస్ చైర్మన్‌గా ఆయన ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే టాటా సన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి మరణించారు. దీంతో ఆయన వారసుడిగా నోయెల్ టాటా(Noel Tata)ను ట్రస్ట్ బోర్డ్ ఎన్నుకుంది. ఐదు ఖండాల్లో దాదాపు 100 దేశాల్లో ఈ సంస్థకు కంపెనీలున్నాయి. ప్రతి ఏటా భారీ ఆదాయం వస్తుంది. అందులో 66 శాతం టాటా ట్రస్ట్‌కు వెళ్లిపోతుంది. ఈ మొత్తం సేవా కార్యక్రమాలకు విరాళాల రూపంలో వెళ్లిపోతుంది. ఈ నేపథ్యంలో నోయెల్ టాటాను ట్రస్ట్ బోర్డ్ ఎన్నుకుంది. అదీకాక ట్రస్ట్ బోర్డ్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నోయెల్‌ను టాటా ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఎన్నుకుంది.

Noel Tata As A…

మరోవైపు టాటా గ్రూప్ చైర్మన్‌గా ఆ సంస్థ వ్యాపారాన్ని 4 బిలియన్ల డాలర్ల నుంచి 100 బిలియన్ల డాలర్లకు రతన్ టాటా తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే రతన్ టాటా వివాహం చేసుకోలేదు. దాంతో ఆయన వారసుడు ఎవరనే ఓ చర్చ సైతం సాగింది. అలాంటి వేళ రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ పేరు వినిపించింది. ఆయనకు ముగ్గురు పిల్లలు మాయా టాటా, నెవిల్లే టాటా, లేహ్ టాటాలు ఉన్నారు. వారు సైతం టాటా సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాటా సంస్థలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

Also Read : Minister Nara Lokesh : అభివృద్ధి అన్ని ప్రాంతాలకు జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Leave A Reply

Your Email Id will not be published!