AP Mega DSC 2024 : ఈ నవంబర్ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్..సబ్జెక్టు పై క్లారిటీ ఇచ్చిన సీఎం

టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని....

AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌కు ముహూర్తం ఖరారైంది. నవంబర్‌ మొదటి వారంలోనే నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నవంబరు 3న ప్రకటన జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం… ప్రస్తుతం జరుగుతున్న ‘టెట్‌’ పరీక్షల ఫలితాలు నవంబరు 2వ తేదీన ప్రకటిస్తారు. టెట్ ఫలితాలు వెలువరించిన మరుసరటి రోజే మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. నిజానికి, కూటమి సర్కార్ కొలువు దీరిని వెంటనే మెగా డీఎస్సీ(AP Mega DSC) నోటిఫికేషన్‌ విడుదల చేయాలని భావించినప్పటికీ.. మరింత మందికి అర్హత కల్పించాలనే భావనతో మరోమారు టెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పరీక్షలు జరుగుతున్నాయి.

AP Mega DSC 2024 Updates

కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భర్తీ చేయనున్న మెగా డిఎస్పీ(AP Mega DSC)లో ఎలాంటి న్యాయవివాదాలకు తావివ్వకుండా, పటిష్టంగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారుల్ని ఇప్పటికే ఆదేశించారు. టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని.. టెట్‌కు, డీఎస్సీకి ఒక్కో దానికి ఏకంగా మూడేసి నెలల చొప్పున ప్రిపరేషన్‌కు సమయం ఇచ్చారు. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కొత్త ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి ఉద్యోగాలు మానుకుని మరీ ఆశావహులు పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఉద్యోగ ప్రకటన చేసిన ఆర్నెల్లకు మించి ఆలస్యమైతే అభ్యర్థులకు భారమవుతుందని భావించిన ప్రభుత్వం.. నవంబర్‌లోనే డిఎస్సీ పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు డిఎస్సీ 2024 సిలబస్ విషయంలో నెట్టింట కొంత గందరగోళం నెలకొంది. సిలబస్‌ మారిందని జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చింది. గత నోటిఫికేషన్‌ ప్రకారంగానే సిలబస్ ఉంటుందని, ఎలాంటి మార్పులు లేవని, పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని స్పష్టత ఇచ్చారు.

Also Read : Virat Kohli : కింగ్ కోహ్లీ ని ఆపడం మావల్ల కాలేదంటున్న పాక్ ఆటగాడు

Leave A Reply

Your Email Id will not be published!