IND vs NZ : స్పిన్నర్ ఫుల్ టాస్ వేసి కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసిన కివీస్

16/1తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ జట్టు గంట వ్యవధిలోనే 66/3తో ఒత్తిడిలో పడిపోయింది...

IND vs NZ : కివీస్ తో రెండో మ్యాచ్ లో టీమిండియా ఎక్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ విసిరిన ఫుల్ టాస్ ను సరిగా అంచనా వేయలేక బంతిని హిట్ చేయబోయి క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ కు చేరాడు. కివీస్ తో టెస్టు సిరీస్ లో పేలవమైన ప్రదర్శన చేసిన కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇది మరో ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేయడంతో.. భారత జట్టు ఇంకా 193 పరుగులు వెనకబడి ఉంది.

IND vs NZ Match Updates

పూణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఉదయం 30 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ కావడంతో కోహ్లి బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇన్నింగ్స్‌లో తన 9వ బంతిని ఆడిన కోహ్లి బంతి డైరెక్షన్ ను తప్పుగా అంచనా వేశాడు. బెంగళూరులో కివీస్‌తో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన కోహ్లి.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ మరోసారి బ్యాటింగ్‌తో నిరాశపరిచాడు.
16/1తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ జట్టు గంట వ్యవధిలోనే 66/3తో ఒత్తిడిలో పడిపోయింది. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైశ్వాల్ (28), రిషబ్ పంత్ (7) ఉండగా.. విరాట్ కోహ్లీ (1), శుభమన్ గిల్ (30) ఈరోజు పెవిలియన్‌‌కి వెళ్లిపోయారు. గురువారం సాయంత్రమే రోహిత్ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

Also Read : NIA : ఆ గ్యాంగ్ స్టార్ అన్మోల్ ను పట్టుకున్న వారికి 10 లక్షల రివార్డు – ఎన్ఐఏ

Leave A Reply

Your Email Id will not be published!