MLA KTR : పొంగులేటి బాంబులకు ఇక్కడ బయపడేదిలేదు
మేం ఒరిజినల్ బాంబులకే భయపడలేదు. దొంగ కేసులు పెడితే పెట్టుకో...
MLA KTR : బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నేతల అరెస్టులు తప్పవని, త్వరలోనే బాంబులు పేలతాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి బాంబులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు, వైఎస్ఆర్ వంటి వారితోనే పోరాటం చేశామని.. మీరో లెక్కా అంటూ విరుచుకుపడ్డారు. పొంగులేటి బాంబులు తుస్సే అంటూ మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఏం పీక్కుంటారో పీక్కోండి.. నీ బాంబులకు భయపడలేదు. కేసులకు భయపడేది లేదు. మేం ఒరిజినల్ బాంబులకే భయపడలేదు. దొంగ కేసులు పెడితే పెట్టుకో. నీ ఈడీ కేసులు, మోడీ కాళ్ళు మొక్కిన బాంబుల గురించి చెప్పు. చంద్రబాబు, వైస్సార్తోనే కొట్లాడినం.. ఈ చిట్టి నాయుడు ఓ లెక్కనా. అడ్డమైన కేసులు పెట్టి జైలుకు పంపితే పంపు.. ఆర్ఆర్ టాక్స్‌లపై మేం వచ్చాక లెక్క తెలుస్తాం. సీఎం రేవంత్ బామ్మర్ది, పొంగులేటి బాగోతాలు అన్నీ బయటకు తీస్తాం. చావుకు మేం భయపడం’’ అంటూ కేటీఆర్(KTR) స్పష్టం చేశారు.
MLA KTR Comment
శుక్రవారం సిరిసిల్లలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ విచారణకు ఎమ్మెల్యే కేటీఆర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయన్నారు. విద్యుత్‌ను వ్యాపార ధోరణిలో చూడొద్దని తెలిపారు. విద్యుత్ భారం కాదని.. బాధ్యతగా ప్రభుత్వం భావించాలని సూచించారు. పేదల నడ్డి విరిచేలా సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రూ.963 కోట్ల చార్జీలు ప్రజల మీద రుద్దుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజల మీద తాము భారం పడనివ్వలేదని చెప్పుకొచ్చారు. 300 యూనిట్లు దాటితే.. ఒక్క యూనిట్‌కు 50 రూపాయలా.. ప్రభుత్వ ఖజానా నింపుకునేది ఇలాగేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 నెలలుగా పారిశ్రామిక అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రాష్ట్రం మీద 18 వేల కోట్ల భారం మోపుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read : IND vs NZ : స్పిన్నర్ ఫుల్ టాస్ వేసి కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసిన కివీస్