AP Govt : విజయవాడ వరద బాధితుల ఖాతాల్లో పైసలు జమ చేసిన ఏపీ సర్కార్
కాగా.. విజయవాడలో వరదలు ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే...
AP Govt : విజయవాడ వరద బాధిత ప్రజల్లో మరికొంత మందికి ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. శుక్రవారం మరో 1501 మందికి రూ.2.5 కోట్ల పరిహారం విడుదలైంది. 1501 మంది బాధితులకు వారి అకౌంట్లకు ఈరోజు నగదును సర్కార్(AP Govt) బదిలీ చేసింది. ఇందులో బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్‌గా ఉన్న కారణంతో 143 మందికి లబ్ధిదారుల అకౌంట్లలో పరిహారం జమ అవ్వలేదని అధికారులు గుర్తించారు. వీరికి సంబంధించి మరోసారి బ్యాంకు వివరాలు తీసుకుని పరిహారాన్ని అందించనున్నారు. బ్యాంకు అకౌంట్లు అందుబాటులో లేని మరో 256 మంది అర్హుల వివరాలను ఆయా సచివాలయాలు, ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా ప్రభుత్వం వెల్లడించనున్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించి ఈ 256 మంది తమకు వచ్చే పరిహారం పొందవచ్చని అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పరిహారం అందాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అధికారులు వెల్లడించారు. పరిహారం అందజేతపై తాజా వివరాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి జిల్లా అధికారులు తెలియజేశారు.
AP Govt Releases..
కాగా.. విజయవాడ(Vijayawada)లో వరదలు ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. విజయవాడను వరదలు ముచ్చెత్తడంతో ప్రజలు అల్లాడిపోయారు. వరద ఉధృతితో విజయవాడ వాసులు సర్వం కోల్పోయారు. విజయవడ వరద పరిస్థితిపై వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం.. సీఎం సహా, అధికారులు అంతా వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా పది రోజుల పాటు అక్కడే ఉంటూ.. వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులను పరామర్శించారు. అంతేకాకుండా వరద ఉధృతితో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వారికి వరద సహాయాన్ని సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్‌లో విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు వరద సహాయాన్ని వారి ఖాతాల్లో వేశారు.
ఇళ్లు, దుకాణాలు, తోపుడు బళ్లు, వ్యాపారాలు, చిన్న తరహ పరిశ్రమలు, వాహానాలు, పంటలు, పశువులకు ఆర్థిక సాయం అందించింది. వరదలు వచ్చిన 15 రోజుల్లోనే బాధితులకు వారి ఖాతాల్లో వరద సహాయాన్ని జమ చేసింది సర్కార్. మొత్తం రూ.618 కోట్లను పరిహారంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. విడతల వారీగా ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో డబ్బును జమచేస్తోంది. ముందుగా రూ.602 కోట్లను జమ చేసిన సర్కార్.. ఆ తరువాత రూ.9 కోట్లు.. ఆపై రూ. 16 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమచేసింది. మొత్తం 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందజేసింది. అలాగే తాజాగా 2954 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1646 మందిని అర్హులుగా గుర్తించారు. వారిలో ప్రస్తుతం 1501 మంది బాధితులకు రూ.2.5 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందజేసింది.
Also Read : MLA KTR : పొంగులేటి బాంబులకు ఇక్కడ బయపడేదిలేదు