TG CP Anand : డ్రగ్స్ దందాపై సంచలన విషయాలు వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్
అబ్దుల్ రెహమాన్ నగరంలో కీలకంగా ఉంటూ లోకల్‌గా డ్రగ్స్ డెలివరీ బాయ్‌లాగా వ్యవహరిస్తున్నాడన్నారు...
CP Anand : భాగ్యనగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు రూ.25 లక్షలు విలువ చేసే డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. అలాగే ఇంటర్నేషనల్ ఫడ్లర్, అంతర్రాష్ట్ర ఫడ్లర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంది. రెండు ప్రాంతాల్లో భారీగా డ్రగ్స్‌ను ఖాకీలు పట్టుకున్నారు. భారీగా డ్రగ్స్ పట్టుబడటంపై శుక్రవారం సీపీ సీపీ ఆనంద్(CP Anand) మీడియాకు వివరాలు వెల్లడించారు. మాదక ద్రవ్యాలపై హైదరాబద్(Hyderabad) పోలీసుల పోరు కొనసాగుతుందని సీపీ స్పష్టం చేశారు. గత నెల రోజుల్లో నార్కోటిక్ పని తీరుపై సమీక్ష చేసి బలోపేతం చేశామన్నారు. డ్రగ్స్ ముఠాలను అదుపు చేయాలని ఆదేశాలు ఇచ్చామని.. సింథటిక్ డ్రగ్స్ బెంగళూరు, గోవా నుంచి సరఫరా అవుతాయని… న్యాచురల్ డ్రగ్స్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఏపీ నుంచి సరఫరా అవుతున్నాయని వెల్లడించారు. బెంగళూర్‌పై ముందుగా దృష్టి పెట్టామని.. ఇందులో రెండు ముఠాలను హెచ్ న్యూ పట్టుకుందని తెలిపారు. వీళ్ళు అందరూ కూడా ఆఫ్రికా దేశానికి చెందినవారన్నారు. మొదటి గ్యాంగ్ లో సుడాన్ దేశస్థులు ఇద్దరు ఉన్నారని తెలిపారు.
TG CP Anand Comments..
అబ్దుల్ రెహమాన్(Abdul Rehman) నగరంలో కీలకంగా ఉంటూ లోకల్‌గా డ్రగ్స్ డెలివరీ బాయ్‌లాగా వ్యవహరిస్తున్నాడన్నారు. 2014 లో హైదరాబాదు(Hyderabad)కు స్టూడెంట్ వీసాపై వచ్చాడని.. అప్పటి నుంచి నగరానికి వస్తూ పోతూ ఉన్నాడన్నారు. గత రెండు సవత్సరాల క్రితం నగరానికి వచ్చి టోలిచౌకీలో ఉంటున్నాడని తెలిపారు. వీసా గడువు ముగిసిన కూడా టోలిచౌకిలో ఉంటున్నాడన్నారు. బెంగళూర్ నుంచి ఖుర్భా అనే సప్లయర్ డ్రగ్స్ ఆర్డర్ తీసుకుంటాడని.. అతనిపై ఇంకా హోల్ సేల్ సప్లయర్స్ ఉన్నారని.. వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. రొమేనియా, టాంజానియా, కేరళ , నైసీరియాకు చెందిన మెయిన్ సప్లయర్‌లు ఉన్నారని తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా బెంగళూరులో ఖుర్బా డ్రగ్స్ ఆర్డర్లు స్వీకరిస్తాడన్నారు. హానిన్ అనే వ్యక్తికి డెలివరీ చేయాల్సిన అడ్రస్ చేరవేస్తాడని.. హనిన్ ఇచ్చిన అడ్రస్‌కు రెహమాన్ వెళ్లి డ్రగ్స్ సరఫరా చేస్తాడన్నారు. ఒకరికొకరు కలుసుకోకుండా డ్రగ్స్ సప్లై చేస్తున్నారన్నారు. ‘‘ ఖుర్భాకు నేర చరిత్ర ఉంది. రెహమాన్ ఆపిల్ ఫోన్ సీజ్ చేశాం.. అందులో చాలా వివరాలు ఉన్నాయి. వినియోగదారుల వివరాలు కూడా వచ్చాయి. వారిని త్వరలో అదుపులోకి తీసుకుంటాం. వారి వద్ద నుంచి సమాచారం సేకరిస్తాం… అవసరం అయితే అరెస్ట్ చేస్తాం’’ అని సీపీ స్పష్టం చేశారు.
ఇక ‘‘రెండవ కేసులో కూడా బెంగళూరుకు సంబంధాలు ఉన్నాయి. ఇమ్రాన్ అనే వ్యక్తి బంజారాహిల్స్ ఉంటాడు. మత్తు పదార్థాలకు చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డాడు. ఫిబ్రవరిలో యాష్ ఆయిల్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. జైలుకు వెళ్లి ఇటీవల తిరిగి వచ్చాడు.. ఎండీఎంఏ డ్రగ్స్ సప్లై చేస్తూ పెట్టుబడ్డాడు. ఇమ్రాన్ బెంగళూరుకు వెళ్లి ఓ నైజీరియాన్‌తో డ్రగ్స్ సేకరిస్తాడు. డెడ్ డ్రాప్ ద్వారా నందకుమర్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ సేకరిస్తారు. నంద కుమార్‌ను కూడా అరెస్ట్ చేశాం. నైజీరియన్‌తో పాటు నవీన్ అనే కేరళకు చెందిన వ్యక్తి నుంచి కూడా ఇమ్రాన్ డ్రగ్స్ సేకరిస్తాడు . బెంగళూరులో ఉన్న నైజీరియన్‌ను అరెస్టు చేస్తాం. క్యాష్ ఆన్ డెలివరి డెడ్ డ్రాప్ ద్వారా పేమెంట్ తీసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తారు’’ అని తెలిపారు.
‘వినియోగదారుల వివరాలు ఉన్నాయి. వారిని కూడా అదుపులో తీసుకుంటాం. వారి ద్వారా మిగతా కన్జ్యూమర్ల వివరాలు కూడా సేకరిస్తాం. నిందితులు డెడ్ డ్రాప్ అండ్ కాంటాక్ట్ లెస్ పద్ధతి ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. సోషల్ మీడియా స్నాప్ చాట్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. డ్రగ్స్ ఆర్డర్స్ ఏ పద్ధతిలో తీసుకున్న మేము గుర్తిస్తాం. మ్యూల్ అకౌంట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నట్టు గుర్తించాం. మెయిన్ సప్లయర్లు అందరూ ఫేక్ ఐడెంటీలతో బెంగళూరులో ఉంటున్నారు. ఒరిస్సాలో హ్యాష్ ఆయిల్ తయారు చేస్తున్న ప్రాంతాన్ని గుర్తించాం. ఏపీ పోలీసుల సహకారంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తాం. పట్టుపడ్డ వారిలో సంపన్నుల కుమారులు కూడా ఉన్నారు’’ అంటూ సీపీ సీవీ ఆనంద పేర్కొన్నారు.
Also Read : Satya Nadella : 2024 లో మైక్రోసాఫ్ట్ సీఈవో కు మైండ్ బ్లోయింగ్ ఇంక్రిమెంట్