IND vs NZ : టెస్ట్ క్రికెట్ లో 45 ఏళ్ల రికార్డును బద్దలగొట్టిన యశస్వి జైస్వాల్
భారత్ తరపున ఆడిన టెస్టుల్లో గత 11 ఇన్నింగ్స్ లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు...
IND vs NZ : భారత స్టార్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) టెస్టు క్రికెట్లో సంచలనం నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న పూణె టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు చరిత్ర సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి 65 బంతుల్లో 77 పరుగులు చేసి 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. సొంతగడ్డపై ఒక క్యాలెండర్ సంవత్సరంలో టెస్టుల్లో 1000 పరుగులు పూర్తిచేసిన రికార్డును యశస్వి సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గుండప్ప విశ్వనాథ్ 45 ఏళ్ల రికార్డును యశస్వి బద్దలు కొట్టాడు. 1979లో భారత మైదానంలో విశ్వనాథ్ 1047 పరుగులు చేశాడు.
IND vs NZ Yashasvi Jaiswal Innings..
ఈ ఏడాది భారత గడ్డపై యశస్వి(Yashasvi Jaiswal) 1060 పరుగులు చేశాడు. తనకు అవకాశం వచ్చిన మ్యాచుల్లో పరుగుల వరద పారిస్తున్నప్పటికీ యశస్వి ఇన్నింగ్స్ పెద్దగా ఆడలేకపోతున్నాడు. భారత్ తరపున ఆడిన టెస్టుల్లో గత 11 ఇన్నింగ్స్ లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. చివరిసారిగా 2024 రాజ్ కోట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై అజేయంగా 214 పరుగులు చేశాడు. ఆనాటి నుంచి ఒక్క సెంచరీ కూడా యశస్వి చేయలేకపోయాడు. 11 ఇన్నింగ్స్‌లలో 6 అర్ధ సెంచరీలు మాత్రం సాధించగలిగాడు. జూలై 2023 లో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో యశస్వి అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. టెస్ట్ క్రికెట్లో తన మొదటి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ సాధించాడు. అతను దేశీయ క్రికెట్లో ముంబై తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు.
ఎడమచేతి వాటం గల ఈ ఓపెనింగ్ బ్యాటర్ 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన 5-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్‌లలో డబుల్ సెంచరీలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వినోద్ కాంబ్లీ , విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు . టెస్ట్ చరిత్రలో సర్ డాన్ బ్రాడ్‌మన్ మరియు వినోద్ కాంబ్లీ తర్వాత రెండు డబుల్ సెంచరీలు సాధించిన మూడో పిన్న వయస్కుడైన క్రికెటర్ గా నిలిచాడు. అదే సిరీస్‌లో, అతను ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (12) సాధించిన క్రికెటర్‌గా వసీం అక్రమ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు.#
Also Read : Minister Seethakka : విధులు సరిగ్గా నిర్వహించలేని అధికారులకు సీతక్క స్వీట్ వార్నింగ్