Minister Nimmala : మాజీ సీఎం వివాదంలో టీడీపీ ఎందుకు జోక్యం చేసుకుంటుంది

జిల్లాలకు సంబంధించిన సమస్యలపై ఇవాళ(శనివారం) అధికారులతో సమావేశంలో చర్చించామని తెలిపారు...

Minister Nimmala : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ వివాదంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం టీడీపీకి లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్ క్యారెక్టర్ ఎంటో దేశమంతా అర్థమైందని అన్నారు. తల్లికి, కుమారుడికి మధ్య ఆస్తుల ఎంఓయూ ఉంటుందని దేశంలో తొలిసారిగా తెలిసిందని చెప్పారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఉచిత ఇసుక అమల్లో సమస్యలు గుర్తించామని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala) అన్నారు.

Minister Nimmala Comment

జిల్లాలకు సంబంధించిన సమస్యలపై ఇవాళ(శనివారం) అధికారులతో సమావేశంలో చర్చించామని తెలిపారు. మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు మీడియా సమావేశంలో పాల్గొని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… ఓపెన్ ఇసుక రీచ్‌ల్లో వారం రోజుల్లో ఇసుక తవ్వకాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామని అన్నారు. వైసీపీ పాలనలో టన్ను ఇసుక రూ.625 ఉంటే ప్రస్తుతం టన్ను ఇసుక రూ. 215కే అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. రోడ్లు మరమ్మతులు మూడు నెలల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించామని అన్నారు. ఇరిగేషన్ నిర్వహణ కోసం రూ. 980 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా రూ. 275 కోట్లు మాత్రమే ఇరిగేషన్ నిర్వహణ కోసం ఖర్చు చేశారని చెప్పారు. లిప్ట్ ఇరిగేషన్‌లకు పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలని నిర్ణయించామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, అబివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

Also Read : IND vs NZ : టెస్ట్ క్రికెట్ లో 45 ఏళ్ల రికార్డును బద్దలగొట్టిన యశస్వి జైస్వాల్

Leave A Reply

Your Email Id will not be published!