CM Revanth Reddy : మూసీ పునరుజ్జివంపై సంచలన విష్యాలు వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తామని మాటిచ్చారు...

CM Revanth Reddy : మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ(ఆదివారం) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ సదర్ సమ్మేళనం జరిగింది. సదర్ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిదని ప్రశంసించారు. ఇక నుంచి ప్రతీ ఏడాది సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహించాలని ఈ వేదిక నుంచి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సదర్ అంటే యాదవుల ఖదర్ అని ఉద్ఘాటించారు. యాదవులు రాకీయంగా ఎదగాలని అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభకు పంపించామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

CM Revanth Reddy Comment

రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తామని మాటిచ్చారు. ఈ నగరం అభివృద్ధి చేయడానికి యాదవ సోదరులు అండగా నిలబడాలని కోరారు. ఏ శక్తులు అడ్డువచ్చినా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతవాసుల జీవన ప్రమాణాలను మెరుగు పరచబోతున్నామని చెప్పారు. యాదవ సోదరులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ఆనాడు ముషీరాబాద్‌లో అంజన్ కుమార్ యాదవ్‌ను గెలిపించి ఉంటే.. యాదవుల వైపు నుంచి మంత్రిగా నిలబడేవారని చెప్పారు. ఆయన ఓడినా యాదవ సోదరులకు ప్రాధాన్యత ఉండాలని అనిల్‌కు రాజ్యసభ ఇచ్చానని గుర్తుచేశారు..యాదవ సోదరులారా ధర్మం వైపు నిలబడండి.. అధర్మాన్ని ఒడిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Also Read : Minister Kishan Reddy : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వీలైనంత ఎక్కువగా వినియోగించాలి

Leave A Reply

Your Email Id will not be published!