Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న బైడెన్
తన ముందు వీల్ చైర్‌లో ఉన్న ఒక వృద్ధ మహిళకు బిడెన్ సాయం చేశారు...
Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో ప్రెసిడెంట్ జో బిడెన్(Joe Biden) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు సోమవారం ముందస్తు బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నారు. డేలావేర్‌లోని విల్మింగ్టన్‌లో తన నివాసానికి సమీపంలో ఉన్న ‘స్టేట్ ఆఫ్ డెలావేర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్షన్స్’కు వెళ్లి ఓటు వేశారు. అయితే ఆయన వెళ్లే సరికి అక్కడ భారీ క్యూలైన్ ఉండడంతో దాదాపు 40 నిమిషాలపాటు వేచిచూడాల్సి వచ్చింది. 40 నిమిషాల పాటు ఆయన క్యూలైన్‌లోనే నిలుచున్నారు. క్యూలైన్‌లో ఓటర్లతో మాట్లాడుతూ కనిపించారు.
Joe Biden Vote..
తన ముందు వీల్ చైర్‌లో ఉన్న ఒక వృద్ధ మహిళకు బిడెన్(Joe Biden) సాయం చేశారు. చైర్‌ను ముందుకు నెట్టారు. ఇక ఓటు వేయడానికి ముందు ఎన్నికల అధికారికి తన గుర్తింపు కార్డును చూపించారు. అనంతరం ఒక ఫారమ్‌పై సంతకం చేసి ఇచ్చారు. అనంతరం నల్లటి తెర చాటున ఉన్న పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లి బైడెన్ ఓటు వేశారు. ఇప్పుడే ఓటు వేశానంటూ బిడెన్ ప్రకటించారు. కాగా బైడెన్ ఓటు వేసిన కేంద్రం వద్ద పలువురు తొలిసారి ఓటర్లు ఉత్సాహంగా కనిపించారు. వారితో బైడెన్ మాట్లాడారు. ‘‘ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు ఇతర డెమొక్రాట్లు గెలుస్తారని మీరు భావిస్తున్నారా’’ అని యువతను ప్రశ్నించారు. ‘‘ మనం చేయగలమనే నేను అనుకుంటున్నా’’ అని ఓ యువకుడు చెప్పాడు.
కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగిన విషయం తెలిసిందే. డెమొక్రాటిక్ పార్టీలో ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళనలు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించే అవకాశాలు తక్కువనే అంచనాల నేపథ్యంలో నిష్క్రమించారు. ఈ మేరకు జులైలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌ను తన వారసురాలిగా ఎన్నుకునేందుకు మొగ్గుచూపారు. అధ్యక్ష అభ్యర్థిగా ఆమెను బలపరిచారు. కాగా బైడెన్‌కు సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 1970 నుంచి కొన్ని సంవత్సరాలు మినహా మిగతా కాలమంతా ఆయన క్రియాశీలకంగానే ఉన్నారు. అధ్యక్షుడు కావడానికి ముందు మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు. డెమొక్రాటిక్ పార్టీలో కూడా కీలక పదవులు నిర్వహించారు.
Also Read : CPI Narayana : విమాన సంస్థల పై భగ్గుమన్న సిపిఐ నారాయణ