JD Vance : అమెరికా ఉప అధ్యక్షుడి పదవికి ఆంధ్రప్రదేశ్ అల్లుడు
విశాఖపట్నంలోనూ ఆమెకు బంధువులున్నారు...
JD Vance : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ అల్లుడు ఉపాధ్యక్షుడు కానున్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అమెరికాలో గెలుపు కోసం 270 ఓట్లు అవసరం కాగా.. రిపబ్లికన్ పార్టీ మెజార్టీ మార్క్ లీడ్‌ను దాటడంతో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షులు కానున్నారు. ఇక ఉపాధ్యక్షుడిగా జెడీ వాన్స్(JD Vance) ఎన్నికకానున్నారు. గత ఎన్నికల్లో భారత మూలాలున్న కమల హారీస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కాగా.. ఈసారి తెలుగు మూలాలున్న వ్యక్తి భర్త ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు.
దీంతో ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడి భార్య ఉషా చిలుకూరి పేరు ఇప్పుడు భారత్‌లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మార్మోగిపోతోంది. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడి.. దేశం గర్వించే స్థాయికి ఎదిగిన ఉష పూర్వీకుల మూలాలు కష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉండగా.. విశాఖపట్నంలోనూ ఆమెకు బంధువులున్నారు. వైజాగ్‌కు చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ సి శాంతమ్మ (96)కు ఉష మనవరాలు వరుస అవుతారు. శాంతమ్మ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 96 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.
JD Vance As a….
భర్తచిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి ద్వారా ఉషతో తనకు కుటుంబ సంబంధం ఉందని, ఆమె తనకు మనవరాలు అవుతుందని శాంతమ్మ తెలిపారు. ఐఐటీ ప్రొఫెసర్‌గా పనిచేసిన తప మరిది రామశాస్త్రి మనవరాలే ఆమె’ అని శాంతమ్మ చెప్పారు. రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. వారు శాన్ డియాగోలో ఇంజనీరింగ్, మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వారి కుమార్తే ఉషా చిలుకూరి. ఆమె భర్త జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు కాబోతున్నారు.
Also Read : CM Siddaramaiah : ముడా స్కాం ఆరోపణలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కర్ణాటక సీఎం