PM Vidyalaxmi : మధ్యతరగతి విద్యార్థులకు పీఎం విద్యాలక్ష్మి తో సాయం చేయనున్న కేంద్రం
ఈపథకం కింద ఏటా గరిష్టంగా 22 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని కేంద్ర మంత్రి చెప్పారు...
PM Vidyalaxmi : ఉన్నత విద్యా సంస్థల్లో చేరాలనే ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల వారి తమ కలలను సాకారం చేసుకోలేకపోతున్న మధ్య తరగతి విద్యార్థులకు కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేందుకు ‘పీఎం విద్యాలక్ష్మి(PM Vidyalaxmi)’ పథకానికి కేంద్ర క్యాబినెట్ బుధవారంనాడు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పీఎం విద్యాలక్ష్మి పథకం కింద ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన వారు ఆయా సంస్థల్లో చదువుకునేందుకు ‘విద్యా లక్ష్మి పథకం’ ద్వారా రుణాలు పొందవచ్చు. ఈ రుణాలకు కొలేటరల్, గ్యారంటర్ అవసరం లేదని క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.దేశవ్యాప్తంగా 860 ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో రూ.7.50 లక్షల వరకూ రుణం పొందవచ్చు. రుణంలో 75 శాతం బ్యాంకులకు కేంద్రం గ్యారెంటీ ఇస్తుంది.
PM Vidyalaxmi Helps…
ఈపథకం కింద ఏటా గరిష్టంగా 22 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని కేంద్ర మంత్రి చెప్పారు. వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షల వరకూ ఉన్నవారికి ఈ పథకం వర్తింపజేయనున్నారు. రూ.10 లక్షల వరకూ 3 శాత వడ్డీ రాయితీ కల్పించనున్నారు. పీఎం వద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా విద్యార్థులు నేరుగా రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి ఉన్నత విద్యతకు దూరం కాకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.
Also Read : CM Chandrababu : అమెరికా నయా అధ్యక్షుడికి ఏపీ సీఎం అభినందనలు