Sabarimala : శబరిమల భక్తుల సహాయార్థం ‘స్వామి’ పేరుతో అందుబాటులో చాట్ బాట్

తిరువనంతపురంఐఎండీ డైరెక్టర్‌ నీతా.కె.గోపాల్‌ బుధవారం తొలి బులెటిన్‌ను విడుదల చేశారు...

Sabarimala : శబరిమల యాత్రికులకు సేవల కోసం కేరళ ప్రభుత్వం ‘స్వామి’ పేరుతో చాట్‌బాట్‌ అందుబాటులోకి వచ్చింది. కేరళ సీఎం పినరయి విజయన్‌ బుధవారం ‘స్వామి’ చాట్‌బాట్‌ లోగోను ప్రారంభించారు. స్మార్ట్‌ఫోన్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా భక్తులకు ఆరు భాషల్లో- ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో అయ్యప్ప స్వామి స్వయంగా వివరాలు అందించినట్లుగా సమగ్ర వివరాలు లభ్యమయ్యేలా ఈ చాట్‌బాట్‌ను రూపొందించారు. శబరిమల(Sabarimala)లో పూజాసమయాలు, ఇతర విశేషాలే కాకుండా.. భక్తులు విమానాలు, రైళ్లు, స్థానిక పోలీసుల వివరాలు, అటవీశాఖ సేవలను ‘స్వామి’ ద్వారా పొందవచ్చు. శబరిమల నడక మార్గాల్లో భక్తులకు వాతావరణ హెచ్చరికలను జారీ చేసేందుకు భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) శబరిమల చరిత్రలోనే తొలిసారి మూడు వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

Sabarimala Chatbot..

తిరువనంతపురం ఐఎండీ డైరెక్టర్‌ నీతా.కె.గోపాల్‌ బుధవారం తొలి బులెటిన్‌ను విడుదల చేశారు. గురు, శుక్రవారాల్లో శబరిమలలో భారీ వర్షాలు కురుస్తాయని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, ఇటీవల నెలవారీ పూజలకు కూడా భక్తులు శబరిమలకు పోటెత్తడంతో.. మండల, మకరవిళక్కు నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు పీఎస్‌ ప్రశాంత్‌ వెల్లడించారు. గురువారం నుంచి మండల పూజల సీజన్‌ ప్రారంభమవుతుందని, భక్తుల సౌకర్యార్థం స్వామివారి దర్శన సమయాన్ని 18 గంటలకు పొడిగిస్తున్నామన్నారు.

‘‘తెల్లవారుజామున 3 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తాం. రోజుకు 80 వేల మంది భక్తులకు దర్శనం టికెట్లను విడుదల చేస్తాం. వీటిల్లో 70 వేలు ఆన్‌లైన్‌ బుకింగ్‌ కాగా.. మరో 10వేలు స్పాట్‌బుకింగ్‌. ఎరుమేలి, వండిపెరియార్‌, పంపా వద్ద స్పాట్‌ బుకింగ్‌ కౌంటర్లుంటాయి’’ అని ఆయన వివరించారు. పదునెట్టాంబడి వద్ద సెల్‌ఫోన్లను నిషేధిస్తున్నట్లు తెలిపారు.

Also Read : TG HYDRA : కూల్చివేతలకు తాత్కాలిక విరామం పలికిన ‘హైడ్రా’

Leave A Reply

Your Email Id will not be published!