Kailash Gahlot : ఆప్ పార్టీకి మరో ఎదురుదెబ్బ..రాజీనామా చేసిన రవాణా శాఖ మంత్రి
ఆప్జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు గెహ్లాట్ రాజీనామా లేఖ రాశారు...
Kailash Gahlot : వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కీలక తరుణంలో అధికార ‘ఆమ్ అద్మీ పార్టీ’ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్(Kailash Gahlot) పార్టీకి అదివారంనాడు రాజీనామా చేశారు. తన మంత్రి పదవికి కూడా రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి అతిషి ఆమోదించారు.
Kailash Gahlot Resign..
ఆప్జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు గెహ్లాట్(Kailash Gahlot) రాజీనామా లేఖ రాశారు. అమలుకు నోచుకోలేని ఆప్ వాగ్దానాలు, ఇటీవల తలెత్తిన వివాదాలు వంటివి తన రాజీనామాకు కారణాలుగా అందులో ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కీలక హామీలను పార్టీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.ఎన్నికల వాగ్దానాల్లో ఒకటైన యుమునా నది ప్రక్షాళనను హామీని కూడా ఆయన ప్రస్తావించారు. యుమనా నదిని స్వచ్ఛమైన జలాలుగా మారుస్తామని వాగ్దానం చేసి ఆ పని చేయలేకపోయిందని, బహుశా గతంలో ఎన్నడూ చూడనంత కాలుష్యంలో యుమనా నది కూరుకుపోయందని విమర్శించారు.కేజ్రీవాల్ అధికార బంగ్లా ‘శీష్ మహల్’ చుట్టూ వివాదం ముసురుకోవడాన్ని కూడా గెహ్లాట్ విమర్శించారు.శీష్ మహల్ వంటి అక్షేపణీయ, ఆందోళన కలిగించే చాలా వివాదాలు చుట్టుముట్టాయని, దీంతో ఆప్ ఆద్మీ పార్టీని ఇప్పటికీ నమ్మవచ్చా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ నెలకొన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఢిల్లీప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య నిరంతర ఘర్షణలను కూడా గెహ్లాట్ తప్పుపట్టారు. దీనివల్ల రాజధాని ప్రగతి కుంటుపడిందన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటానికి బదులు, సొంత రాజకీయ ఎజెండా కోసం ఆప్ పోరాటం సాగిస్తోందనేది కాదనలేని వాస్తవమని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ఇందువల్ల ఢిల్లీ ప్రజలకు కనీస సేవలు కూడా అందించలేకున్నారని విమర్శించారు.కేంద్రంతో పోరాటానికే రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక సమయాన్ని కేటాయించుకుంటూ పోతే దేశరాజధాని నిజమైన ప్రగతి అసాధ్యమని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని, అందుకోసం తాను పనిచేస్తానని చెప్పారు. ఇందుకోసం ఆప్‌ను వీడటం తప్ప మనకు మరో మార్గం లేదని, ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆ లేఖలో గెహ్లాట్ తెలిపారు.
కైలాష్ గెహ్లాట్(Kailash Gahlot) రాజీనామాపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు కైలాష్ గెహ్లాట్ స్పందించారు. ఆప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిజాయితీ కోల్పోయిందని తాము ఏదైతే చెప్పామో అది కైలాష్ గెహ్లాట్ రాజీనామాతో మరింత స్పష్టమైందని అన్నారు. ఆప్ ఒక అబద్ధాలపుట్ట అని, అది ఇప్పుడు బయటపడిందని అన్నారు. రాజేంద్ర పాల్ గౌతమ్, రాజ్‌కుమార్ ఆనంద్, ఇప్పుడు కైలాష్ గెహ్లాట్ పార్టీ డొల్లతనాన్ని బయటపెట్టారని అన్నారు. యమునా నదీ ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం రూ.8.500 కోట్లు విడుదల చేసిందని, ఆ సొమ్ము ఏమైందని సచ్దేవ్ ప్రశ్నించారు. ఢిల్లీ వనరులను దుర్వినియోగం చేయడమే ఆప్ పని అని విమర్శించారు.
Also Read : Minister Konda Surekha : ఫోన్ ట్యాపింగ్ పై సంచలన విషయాలు వెల్లడించిన మంత్రి