Anil Jha : ఆప్ పార్టీలో చేరిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే ‘అనిల్ ఝా’
బీజేపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఝా ఆదివారంనాడు అధికారికంగా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు...
Anil Jha : వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఝా(Anil Jha) ఆదివారంనాడు అధికారికంగా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. నార్త్ వెస్ట్ ఢిల్లీ ఢిల్లీలోని కిరారి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు సార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ ఝా ఆ పార్టీని వీడి ఆప్‌లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Anil Jha Joined in AAP Party
కిరారీఅసెంబ్లీ నియోజకవర్గంలో కింద స్థాయి కార్యకర్తల్లోనూ గట్టిపట్టు ఉన్న అనిల్ ఝా కొద్దికాలంలో పార్టీ నాయకత్వం, విధానాలపై అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ మారడం ద్వారా బీజేపీకి సంప్రదాయబద్ధంగా గట్టి పట్టున్న కిరారీలో ఆప్‌కు లబ్ధి చూకూరే అవకాశాలున్నాయని అంటున్నారు. అనిల్ ఝాని పార్టీలోకి అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానిస్తూ, పూర్వాంచల్ కమ్యూనిటీ గట్టి పలుకుబడి కలిగిన నేత అనిల్ ఝా అని, ఢిల్లీలోని అనధికార కాలన్నీలో గణనీయంగా పూర్వాంచల్ కమ్యూనిటీ వాసులు ఉంటున్నారని, ఏళ్లతరబడి వారిని బీజేపీ, కాంగ్రెస్ నిర్లక్ష్యం చేశాయని అన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఆ కాలనీలలో అభివృద్ధి పనులు, ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తానని చెప్పారు.
Also Read : Minister Raja Narasimha : ఖమ్మం మెడికల్ కాలేజ్ ‘ర్యాగింగ్’ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి