MP Eatala Rajender : చర్చకు సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీజేపీ ఎంపీ ఈటల
ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూసేకరణ చేశారు...
Eatala Rajender : నాంపల్లి బిజెపి(BJP) పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్(Eatala Rajender) మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెబుతున్నారంటూ విమర్శించారు.
MP Eatala Rajender Challenges..
ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూసేకరణ చేశారు. ఆ భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారారు. కాంగ్రెస్ పార్టీ(Congress) మ్యానిఫెస్టోలో ఫార్మా సిటీ రద్దు చేసి.. రైతులకు తిరిగి భూమి ఇస్తామని చెప్పారు. ఫోర్త్ సిటీ పేరుతో 14 వేల ఎకరాలకు తోడుగా మరో 16 వేలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొడంగల్ లో రైతులు భూమి ఇవ్వలేమని కాళ్ళు మొక్కినా బెదిరించి సెకరించే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా కలెక్టర్ నాపై దాడి జరగలేదని చెప్పారు.
లగచర్ల చుట్టూ పక్కల గ్రామాలకు మాత్రమే సమస్య కాదు.. ప్రతీ రైతు రేపటి రోజున మాకు సమస్య వస్తుందని భయపడుతున్నారు. రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. రైతులు నక్సలైట్లు కాదు.. వేరే వాళ్ళ భూములు అడగడం లేదు.. రేవంత్ రెడ్డిది మా కొడంగల్ కాకపోయినా గెలిపిస్తే మమల్ని హింసిస్తున్నారని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం.. కానీ రేవంత్ లా ప్రజలను ఇంతగా ఎవరు హింసించలేదు. మూసీ పక్కన ఉన్న భూములను లాక్కొని.. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు. ఒక వైపు హైడ్రా కూల్చివేతలు.. మరోవైపు లగచర్లలాంటి ఘటనలు జరుగుతుండగా ఇంకోవైపు ప్రభుత్వం సంబరాలు చేసుకుంటున్నారు. రేవంత్ ! నీ స్థాయి ఎంత ? మహారాష్ట్ర వెళ్లి ప్రధానిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. ప్రజాక్షేత్రంలో ఒకలా . ! ఢిల్లీ వెళ్లి మోడీని కలిసినప్పుడు మరోలా వ్యవహరిస్తున్నావు. ఏ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశాడు.
నెలనెలానాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైంది ? ఆర్టీసీ కార్మికులకు ఇస్తామని చెప్పిన రెండు పెండింగ్ పీఆర్సీలు ఎందుకు ఇవ్వడం లేదు. కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు.. కానీ కిరాణా కొట్టులో మాత్రం లిక్కర్ దొరుకుతుంది. హామీలు నెరవేర్చకుండా.. ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ మంత్రులే అంటున్నారు. రేవంత్ రెడ్డి భూమి మీదకు వచ్చి మాట్లాడాలి. చట్టాన్ని మరిచిపోయి బాసుల మాట వింటున్న అధికారులు భవిష్యత్తు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భూములు లాక్కోవడానికి నీ అయ్య జాగీరు కాదు.. రేవంత్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గతంలో సర్పంచ్ లు, ఎంపీటీసీలుగా పనిచేసిన వారు బిల్లుల కోసం పోతే పది శాతం కమిషన్ తీసుకుంటున్నారు . హామీల చర్చపై రేవంత్ సవాలును స్వీకరిస్తున్నా. నీ హామీల అమలుపై చర్చకు మోడీ ఎందుకు? ఇక్కడ మేము ఉన్నాం. ఎక్కడ చర్చకు రావాలో రేవంత్ చెప్పాలి. మేము సిద్దంగా ఉన్నాం. నీ ఆరు గ్యారంటీలే కాదు 420 హామీలపై చర్చిద్దామని ఈటల రాజేందర్ అన్నారు.
Also Read : Maharashtra Elections : నువ్వా నేనా అన్న రీతిలో ఇరు పార్టీల సభలు..చివరికి ఎవరిని వారించెనో..