Virat Kohli : ఒక్క పోస్ట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కింగ్ కోహ్లీ
తనమెన్స్ బ్రాండ్ ‘రాన్’ పదేళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకొని కోహ్లీ నేడు ఓ పోస్ట్ పెట్టాడు...
Virat Kohli : ఆసిస్ తో టెస్టుకు ముందు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సోషల్ మీడియా పోస్టు ఒకటి అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోహ్లీ(Virat Kohli) పెర్త్ నెట్స్ పై ప్రాక్టీస్ సెషన్స్ లో మునిగి తేలుతున్నాడు. ఈ ఏడాది కోహ్లీకి ఏమాత్రం కలిసిరావడం లేదు. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పరుగులు చేసేందుకు ఈ వెటరన్ క్రికెటర్ కష్టపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ చేసిన తాజా పోస్టు అభిమానులను గందరగోళానికి గురిచేసింది. అయితే, అతడు పోస్ట్ చేసింది తన బట్టల బ్రాండ్ గురించే అయినా.. అందుకోసం అతడు ఎంచుకున్న వైట్ బ్యాక్ గ్రౌండ్ టెంప్లేట్ ఆ మ్యాటర్ కు సీరియస్ లుక్ ను తీసుకొచ్చింది. ఇది చూసి కొంపదీసి కోహ్లీ రిటైర్మెంట్ గానీ ప్రకటిస్తున్నాడా అని ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత మ్యాటర్ చదివి అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విషయం అనౌన్స్ చేసేందుకూ కోహ్లీ ఇలాంటి టెంప్లేట్ నే వాడాడు.
Virat Kohli Tweet…
తన మెన్స్ బ్రాండ్ ‘రాన్’ పదేళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకొని కోహ్లీ నేడు ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘వెనక్కి తిరిగి చూసుకుంటే.. మేం ఎప్పుడూ కాస్త భిన్నంగానే ఉంటాం. మేం పరిమితులు లేకుండా అన్ని దారుల్లోనూ ప్రయాణించాం. తొలి నాళ్లలోనే మేమేంటో అందరికీ తెలిసింది. అయినా, రెండుసార్లు మిస్‌ఫిట్ అయ్యాం. కాలానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటూ వెళ్లాం. ఆ మార్పులు మా కోర్ ఐడెంటిటీని చెరిపేయకుండా చూసుకున్నాం. కొంతమంది మమ్మల్ని పిచ్చివాళ్లని అనుకున్నారు. కొంతమందికి మేమసలు అర్థం కాలేదు. కానీ మేం అవేమీ పట్టించుకోలేదు. మేమేంటో నిరుపించుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాం. ఈ పదేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాము. మహమ్మారి కూడా మమ్మల్ని వణికించలేదు. ఇతరులకంటే భిన్నంగా ఉండటమే మమ్మల్ని ప్రత్యేకంగా మార్చింది. అదే మా బలం. అదే మా ‘రాన్’. మరో పదేళ్లు ఇలాగే కొనసాగాలనుకుంటున్నాం. రాన్: ఓ సరైన వ్యక్తి కోసం’’ అని తన బ్రాండ్ పేరు, స్లోగన్ ను జత చేసి ఇలా కోహ్లీ రాసుకొచ్చాడు.
Also Read : TG High Court : పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు