Minister Kollu Ravindra : నూతన మద్యం పాలసీపై కీలక స్టేట్మెంట్ ఇచ్చిన ఎక్సైజ్ మినిస్టర్

బియాండ్ విలువ చెప్పకుండా అమ్మకాలు చేపట్టారని మండిపడ్డారు...

Kollu Ravindra : నూతన మద్యం పాలసీపై ఏపీ అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. మద్యం విషయంలో గత ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వ్యవస్థను దెబ్బ తీసిందని విమర్శించారు. అప్పటి సీఎం ప్రచార సభల్లో మద్య నిషేదం అని చెప్పి మద్యనిషేధం దశలవారీ అని తరువాత అన్నారని తెలిపారు.

Minister Kollu Ravindra Comments

ముందుగా కొన్ని దుకాణాలను తగ్గిస్తున్నట్టు తగ్గించి ఏపీటీడీసీ పేరుతో, బార్‌ల పేరుతో దుకాణాలు ఇచ్చారన్నారు. మద్యం రేట్లు 70 శాతం పెంచేయడంతో చివరకు పేదలు జేబులకు చిల్లులు పడ్డాయని తెలిపారు. ఎక్సైజ్ డిపార్టమెంట్‌లోని ఉద్యోగులను వేరు చేసి సెబ్‌ను ఏర్పాటు చేశారన్నారు. లిక్కర్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఇలిసిట్ లిక్కర్ వైపు మళ్ళారన్నారు. ఎమ్మార్పీ రేటు పెరగడంతో చాలా మంది గంజాయి, నాటుసారా వైపు వెళ్ళారన్నారు.

బియాండ్ విలువ చెప్పకుండా అమ్మకాలు చేపట్టారని మండిపడ్డారు. గత అయిదేళ్లలో అసమర్థ విధానాల వల్ల గణనీయమైన రాబడి రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని చెప్పారు. ఐదేళ్లలో 18వేల 68 కోట్ల రూపాయల రాబడిని కోల్పోయామని వెల్లడించారు. ఏపీ నుంచి ఎంఎన్‌సీలను తరిమేశారన్నారు. మార్కెట్‌‌లో ఊరు పేరు లేని 26 కొత్త కంపెనీలను తీసుకువచ్చారని.. వీటిని ప్రవేశపెట్టడం ద్వారా పేదల ఆరోగ్యాలను దెబ్బతీశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : YS Sharmila : కడప స్టీల్ ప్లాంట్ కోసం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగిన షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!