Deputy CM Pawan : మహారాష్ట్రలోని తన ప్రచార బలం చూపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ప్రతిపక్ష ఎంవీఏ కూటమి ఆరు స్థానాల్లో గెలుపొందింది. మరో 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది...
Deputy CM Pawan : అందరి అంచనాలకు అనుగుణంగానే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం దిశగా సాగుతోంది. ప్రస్తుతానికి మహారాష్ట్రలో మహాయుతి కూటమి 37 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 183 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ప్రతిపక్ష ఎంవీఏ కూటమి ఆరు స్థానాల్లో గెలుపొందింది. మరో 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారు అయింది. ఏపీ డిప్యూటీ సీఎం(Deputy CM Pawan), జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీయే తరఫున మహారాష్ట్రలో పలు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించారు.
Deputy CM Pawan Kalyan..
సనాతన ధర్మాన్ని రక్షించాలని, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మహారాష్ట్రలోని పలుచోట్ల జరిగిన బహిరంగ సభల్లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని అక్కడి తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పుణె, బల్లార్ పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్‌లలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ప్రకారం పుణె, బల్లార్ పూర్, షోలాపూర్‌లలో మహాయుతి కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. డెత్లూర్, లాతూర్‌లలో ప్రత్యర్థులతో హోరాహోరీగా తలపడుతున్నారు. దీంతో పవన్ కల్యాణ్ ప్రచారం వల్ల మేలు జరిగిందని బీజేపీ కూటమి అభ్యర్థులు మాట్లాడుకుంటున్నారు. మహారాష్ట్రలో వెలువడుతున్న ఫలితాల్లో మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది. 200 పైచిలుకు స్థానాల్లో విజయం దిశగా సాగుతోంది. మహా ఓటర్లను ఆకట్టుకునేందకు మహాయుతి కూటమి పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది. మహాయుతి కూటమి హామీ ఇచ్చిన ఉచిత పథకాలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపినట్లు అర్థం అవుతోంది.
Also Read : CM Eknath Shinde : మహారాష్ట్ర ఎన్నికల విజయంపై స్పందించిన సీఎం ఏక్ నాథ్ షిండే