MLA Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇతర నేతలపై కేసు నమోదు

పోలీసుల విధులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు...

Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఇవాళ(ఆదివారం) పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన దళితబంధు లబ్ధిదారులతో హుజూరాబాద్‌లో అనుమతి లేకుండా ధర్నా చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy)తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 35(3) BNS యాక్ట్‌ కింద హుజూరాబాద్‌లో కేసు నమోదు చేసినట్లు నోటీసులో పోలీసులు పేర్కొన్నారు.

MLA Kaushik Reddy Police Case..

కాగా..కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో దళితబంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని దళితులు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. దళిత బంధు రెండో విడత డబ్బులు రాని వారు తమ ఇంటికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో లబ్ధిదారులు ఎమ్మెల్యే ఇంటికి పెద్దఎత్తున తరలివచ్చారు. హుజూరాబాద్‌ అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద తాము చేపట్టిన ధర్నాలో పాల్గొనాలని లబ్ధిదారులు కౌశిక్‌రెడ్డిని కోరారు.

దీంతో అందరూ కలిసి ర్యాలీగా చౌరస్తాకు చేరుకుని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. అలాగే… గతంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు ఝలక్ ఇచ్చారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవి చందన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేవారు. 132, 351 (3) బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు నమోదు చేశారు.

శేరిలింగంపల్లిఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గాంధీ ఇంటికెళ్లి బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తానని కౌశిక్‌ శపథం చేశారు. అయితే ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే అనూహ్య రీతిలో పాడి కౌశిక్ రెడ్డి విల్లాకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తన అనుచరులను వెంటబెట్టుకొని వెళ్లడం రచ్చకు దారితీసింది. టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. కిటికీలు, కుండీలు ధ్వంసం చేశారు. ప్రతిగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీంతో దాదాపు గంటన్నరపాటు అక్కడ హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. గాంధీని పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. ఆ తర్వాత సైబరాబాద్‌ కమిషనరేట్‌కు హరీశ్‌, కౌశిక్‌‌లను తరలించారు.

Also Read : IPL 2025 Auction : ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్ కు అన్ని కోట్లా..

Leave A Reply

Your Email Id will not be published!