Minister Kandula Durgesh : సాస్కి పథకం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి 113కోట్లు విడుదల చేసిన కేంద్రం
దేవాదాయ, ఆర్ అండ్ బీ శాఖల మంత్రులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగిందన్నారు...
Kandula Durgesh : రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకమైన “సాస్కి-2024-25 “ద్వారా తొలి విడతగా రూ.113.751 కోట్లు (66 శాతం) విడుదల చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
(Kandula Durgesh)తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. తొలి విడత నిధుల్లో 75 శాతం వినియోగించాక తదుపరి విడత నిధులు (34 శాతం) విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిందన్నారు. సాస్కి పథకం ద్వారా విడుదలైన నిధులతో అఖండ గోదావరి, గండికోటను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.సాస్కి నిధులతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కీలకమైన ప్రాజెక్టులను తగిన విధంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలోని పర్యాటకులనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించవచ్చని అన్నారు.
Minister Kandula Durgesh Comment
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత కార్యక్రమాలకు సంబంధించిన సమగ్ర నివేదిక (డీపీఆర్) సమర్పించామని మంత్రి కందుల దుర్గేష్(Kandula Durgesh) తెలిపారు. పర్యాటకాంధ్రప్రదేశ్ కు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు మంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ అంతా పర్యాటకానిదే అని వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలు నిజం చేస్తూ త్వరితగతిన నిధుల విడుదలకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుపై పర్యాటక శాఖ ప్రయత్నాలు చేస్తుందన్నారు. దేవాదాయ, ఆర్ అండ్ బీ శాఖల మంత్రులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగిందన్నారు. ఢిల్లీలో డిప్యూటీ సీఎం పర్యటించి త్వరితగతిన నిధులు విడుదలకు చొరవ చూపించడంపై కృతజ్ఞతలు తెలిపారు. గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చన్న పవన్ కళ్యాణ్ ఆలోచనలను ఆచరణలో చేసి చూపిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
Also Read : Deputy CM Bhatti : ఆ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని మరో బాంబ్ పేల్చిన డిప్యూటీ సీఎం