Minister Komatireddy : కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలపై భగ్గుమన్న మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy : తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెచ్చుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారికి వచ్చే జనవరి చివరిలో టెండర్లు పిలిచి మార్చిలోపు ఆరు లైన్ల రహదారిగా మార్చుతామని చెప్పారు. ఇవాళ(గురువారం) గాంధీభవన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రూ. 30 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీలను ఆహ్వానించి వారితో శంకుస్థాపన చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Minister Komatireddy Slams..

తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ. 500కు సిలిండర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తారని.. ఆ తేదీని రేపు ప్రకటిస్తామని చెప్పారు. పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మెడికల్ కాలేజ్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడతారని అన్నారు.ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్ గురుకులాకు పోదామంటే తాను వస్తాను.. కానీ పిలగాళ్లు కేటీఆర్, హరీష్ వాఖ్యలపై తాను మాట్లాడనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Also Read : MLA Harish Rao : సీఎం రేవంత్ సర్కార్ వాస్తవాలను తొక్కి పెడుతుంది

Leave A Reply

Your Email Id will not be published!