Jharkhand CM : జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ‘హేమంత్ సోరెన్’

81 స్థానాలున్నా జార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతలుగా పోలింగ్ జరిగింది...

Jharkhand CM : జార్ఖండ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్(Hemant Soren) ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ గాంగ్వార్.. హేమంత్ సోరెన్‌(Hemant Soren)తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతోపాటు ఇండియా కూటమిలోని మిత్ర పక్ష పార్టీల అధినేతలు ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్‌తోపాటు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సమాజవాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్, డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Jharkhand CM Oath Ceremony

81 స్థానాలున్నా జార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ నిర్వహించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా అత్యదిక స్థానాలను.. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను గెలుచుకుంది. అలాగే మిత్ర పక్షాలు కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ ఎంఎల్ (ఎల్) తదితర పార్టీలు సైతం బరిలో నిలిపిన అభ్యర్థులు గెలిచారు. ఇక బీజేపీతోపాటు దాని భాగస్వామ్య పక్షాలు కొన్ని స్థానాలను మాత్రమే ఈ ఎన్నికల్లో దక్కించుకుంది. జార్ఖండ్ రాష్ట్రానికి నాలుగోసారి హేమంత్ సోరెన్(Hemant Soren) ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ఏడాది మొదట్లో భూ కుంభకోణంలో మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో నాటి సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. నాటి నుంచి ఆయన బిర్సా ముండా జైల్లోనే ఉన్నారు. దాంతో జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ సమీప బంధువు చంపయి సోరెన్ బాధ్యతలు చేపట్టారు.

అయితేఇటీవల హేమంత్ సోరెన్‌కు బెయిల్ మంజురుపై విడుదలయ్యారు. దీంతో జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టనుండడంతో.. చంపయి సోరెన్ తన సీఎం పదవికీ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక హేమంత్ సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే.. చంపయి సోరెన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం జార్ఖండ్‌లో అధికార పీఠాన్ని కైవసం చేసుకొనేందుకు బీజేపీ దాని మిత్ర పక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కానీ జార్ఖండ్ ఓటర్లు మాత్రం ఇండియా కూటమిలోని జేఎంఎం దాని మిత్రపక్షాలకే తమ మద్దతు ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో అధికార పీఠాన్ని హేమంత్ సోరెన్ సారథ్యంలోని పార్టీ హస్త గతం చేసుకున్నాయి.

Also Read : Minister Payyavula : ఏపీకి ఉన్న అప్పులపై క్లారిటీ ఇచ్చిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

Leave A Reply

Your Email Id will not be published!