YS Jagan : చంద్రబాబు రెడ్ బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు

వైసీపీ హయంలో పగటిపూటే 9 గంటల పాటు ఫ్రీ కరెంట్ ఇచ్చామని జగన్ వ్యాఖ్యానించారు...

YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందన్నారు. స్టేట్‌లో డిస్కంలు దయనీయ స్థితికి వెళ్లాయని చెప్పారు. ఏకంగా రూ.89 వేల కోట్ల నష్టాలు వచ్చాయని తెలిపారు. తమ హయాంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశామన్నారు వైసీపీ అధినేత. కానీ టీడీపీ ప్రభుత్వంలో డిస్కంల అప్పులు పెరిగాయన్నారు. రెడ్‌బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్(YS Jagan) మండిపడ్డారు.

YS Jagan Slams…

వైసీపీ హయంలో పగటిపూటే 9 గంటల పాటు ఫ్రీ కరెంట్ ఇచ్చామని జగన్ వ్యాఖ్యానించారు. కానీ టీడీపీ సర్కారు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వలేకపోతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో డిస్కంల అప్పులు పెరిగాయన్నారు. ఎక్కడ చూసినా మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో గ్రామ సచివాలయ వ్యవస్థ అగమ్యగోచరంగా మారిందన్నారు జగన్.

‘కూటమిపాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోంది. మా హయాంలో గత ఐదేళ్లలో విప్లవాత్మక అడుగులు పడ్డాయి. ప్రతి ఇంటికీ మంచి చేశాం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఆ అడుగులు ఎలా వెనక్కి వెళ్తున్నాయో గమనిస్తున్నాం. సూపర్ సిక్స్‌లు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కనిపించవు. రెడ్‌బుక్ పాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. బడ్జెట్‌తో ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారు. రాష్ట్రంలో స్కాంల పాలన నడుస్తోంది’ అని జగన్ దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎంతో శ్రమించానని.. కానీ తన కష్టాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read : Jharkhand CM : జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ‘హేమంత్ సోరెన్’

Leave A Reply

Your Email Id will not be published!