Minister Nara Lokesh : విద్యావ్యవస్థపై ఓ సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి లోకేష్

పాఠ‌శాల‌ల బ‌లోపేతానికి, విద్యార్థి వికాసానికి, స‌మస్యల ప‌రిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు...

Nara Lokesh : ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ, మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేష్(Nara Lokesh) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిసెంబ‌ర్ 7న త‌ల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా సమావేశం నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని లోకేష్(Nara Lokesh) పిలుపునిచ్చారు. ఈ మెగా సమావేశానికి ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్చంధ సంస్థలను ఆహ్వానిస్తూ మంత్రి లోకేష్(Nara Lokesh) శుక్రవారం లేఖను విడుదల చేశారు. విద్యావ్యవస్థకు అతి పెద్ద పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7న నిర్వహించనున్న తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

Minister Nara Lokesh Letter..

పాఠ‌శాల‌ల బ‌లోపేతానికి, విద్యార్థి వికాసానికి, స‌మస్యల ప‌రిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రుల మ‌ధ్య ఓ ఆత్మీయ వార‌ధిగా సమావేశం ఉండనుందన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబ‌ర్ 7న విద్యార్థుల త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల స‌మావేశం జరుగనుందని తెలిపారు. సమావేశాన్ని పండుగ వాతావ‌ర‌ణంలో నిర్వహించాల‌ని నిర్ణయం తీసుకున్నామన్నారు. వార్డు స‌భ్యుల నుంచి పార్లమెంటు స‌భ్యుల వ‌ర‌కూ… స‌ర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజాప్రతినిధులు అందరూ రాజ‌కీయాల‌కు అతీతంగా పాల్గొనాలని కోరారు. ఒకే పాఠ‌శాల‌లో కాకుండా వారి వారి గ్రామాల పాఠ‌శాల‌ల్లో జ‌రిగే మెగా పేరెంట్- టీచ‌ర్ మీటింగ్‌లో పాల్గొనాల‌ని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, పరివర్తన, క్రమశిక్షణను తల్లిదండ్రులు తెలుసుకోవచ్చి మంత్రి లోకేష్‌ లేఖలో పేర్కొన్నారు.

మంత్రిలోకేష్ లేఖ

‘‘అందరికీనమస్కారం.

పాఠశాలవిద్యావ్యవస్థకే అతి పెద్ద పండుగగా రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం (PTM)లో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. ఈ సమావేశం పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుంది. ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ 7న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయించాం.

ఇందులో వార్డు సభ్యుల నుంచి పార్లమెంటు సభ్యుల వరకూ… సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకూ ప్రజాప్రతినిధులు అందరూ రాజకీయాలకు అతీతంగా.. మీ, మీ పరిధి పాఠశాలలు, మీ సమీప స్కూళ్లలో జరిగే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, ప్రవర్తన, క్రమశిక్షణ తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. పిల్లల సమస్యలు, అభ్యసనా సామర్థ్యాలు, క్రీడలు, కళలు పట్ల ఆసక్తులను టీచర్ ముందుంచి వారిని మరింతగా ఆయా అంశాల్లో పరిణతి సాధించేలా ప్రోత్సహించవచ్చు.

విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడం.. విద్య నేర్చుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులను పాఠశాలలకు దగ్గర చేయడం అనేది మన ప్రభుత్వం లక్ష్యం. పేరెంట్-టీచర్ మీటింగ్‌కు హాజరయ్యే ప్రజాప్రతినిధులు అందరూ ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. మీ పార్టీ జెండాలు. కండువాలు, రంగులు వేసుకుని రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. పాఠశాలలకు విరాళాలు ఇచ్చిన దాతలు, పాఠశాలల అభివృద్ధికి దోహదపడే పూర్వవిద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా డిసెంబర్ 7న జరగబోయే మెగా పేరెంట్- టీచర్ మీటింగ్‌లో భాగం కావాలని మనస్పూర్తిగా కోరుతూ అందరికీ ఇదే నా ఆత్మీయ ఆహ్వానం’’ అంటూ మంత్రి లోకేష్ లేఖలో పేర్కొన్నారు.

Also Read : Minister Anagani : కళంకిత కార్పొరేటర్లు తప్ప మిగతా వాళ్ళు ముహూర్తం చూసుకుని రావచ్చు

Leave A Reply

Your Email Id will not be published!