Home Minister Anitha : తిరుమలలో భక్తుల భద్రతపై హోమ్ మంత్రి కీలక ఆదేశాలు
భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోందని.....
Home Minister : ఫెంగల్ తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత(Vangalapudi Anitha) సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి(Home Minister) స్పష్టం చేశారు.
Home Minister Anitha Comments
భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోందని… అలాగే నాయుడుపేట,పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో వాగులు, వంకల పొంగిపొర్లుతున్నందున పరిసరాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద సముద్రం ముందుకొచ్చి ముంపుకు గురైన నేపథ్యంలో ప్రభావిత గ్రామాల ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తిరుపతి, తిరుమల ప్రాంతాలలో వర్షాల ధాటికి కొండచరియలు జారిపడుతున్న నేపథ్యంలో భక్తులు, ప్రజల రాకపోకలు, భద్రత పట్ల దృష్టి పెట్టాలని కలెక్టర్లకు హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు.
మరో వైపు..తుఫాను ప్రభావిత ప్రాంతాల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుతం ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుఫాను నష్టాన్ని మంత్రి గొట్టిపాటికి అధికారులు వివరించారు. తిరుపతి జిల్లా పరిధిలో అధిక శాతం నష్టం వాటిల్లినట్లు తెలిపారు. మంత్రి ఆదేశాలతో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక బృందాలతో అధికారులు పనులు చేపట్టారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. 95 శాతం మేరకు విద్యుత్ పునరుద్ధరణ పనులను అధికారులు పూర్తి చేశారు.మధ్యాహ్నం కల్లా విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని మంత్రికి తెలిపారు. ప్రజలకు ఏ ఇబ్బందీ రానీయొద్దని.. తుపాన్ తగ్గే వరకు అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read : Minister Gottipati : ఫెంగల్ తుఫాన్ నష్టాన్ని మంత్రి గొట్టిపాటి వివరించిన అధికారులు