Minister Payyavula : మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణలపై స్పందించిన మంత్రి పయ్యావుల కేశవ్

కేరళ,తమిళనాడు రాష్ట్రాల్లోనే తన వియ్యంకులు వ్యాపారం చేస్తున్నారని.....

Minister Payyavula : బియ్యం రవాణాకు సంబంధించి మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిపై మాజీ మంత్రి పేర్నినాని పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పయ్యావుల(Minister Payyavula) స్పందిస్తూ పేర్నినానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పయ్యావుల(Minister Payyavula) మాట్లాడుతూ.. ‘‘ మా వియ్యంకుల కుటుంబం మూడు తరాలుగా బాయిల్డ్ రైస్ ఎగుమతి వ్యాపారం చేస్తున్నారు. ముడిబియ్యం వ్యాపారం చేయరు.. స్టీమ్ రైస్ మాత్రమే ఎగుమతులు చేస్తారు. నాతో వియ్యం పొందాక మా వియ్యంకుడు బియ్యం వ్యాపారం చేయట్లేదు. రేషన్ బియ్యంతో నా వియ్యంకుడి వ్యాపారానికి సంబంధం లేదు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి సొంత ఫ్యాక్టరీలో మిల్లింగ్ చేసుకుని ఎగుమతి చేస్తారు’’ అని మంత్రి స్పష్టం చేశారు.

Minister Payyavula Comments

కేరళ,తమిళనాడు రాష్ట్రాల్లోనే తన వియ్యంకులు వ్యాపారం చేస్తున్నారని… ఏపీలో గింజ కూడా కొనుగోలు చేయలేదన్నారు. మాజీ మంత్రులు పేర్ని నాని(Perni Nani), అంబటి రాంబాబుకు అనుమానం ఉంటే చెక్ పోస్ట్ పెట్టుకుని ప్రతి బ్యాగ్‌ను తనిఖీ చేసుకోవచ్చని అందుకు తానే అనుమతులు ఇప్పిస్తానని తెలిపారు. వాళ్లు చేసేది పారాబాయిల్డ్ రైసు వ్యాపారం మాత్రమే అని మంత్రి తేల్చిచెప్పారు. అలాగే గత ఐదేళ్లలో మద్యంలో ఇసుక , మద్యం, బియ్యంలో అనేక అవకతవకలు జరిగాయని.. వాటిని స్టీమ్ లైన్ చేస్తున్నామన్నారు. దీనిపై కేబినెట్‌లో చర్చించినట్లు తెలిపారు. గతంలో జరిగిన తప్పుడు విధానాలను సరిదిద్దుతున్నట్లు చెప్పారు. అదాని అవినీతి వ్యవహారం బయటకు తీసింది తానే అని చెప్పుకొచ్చారు. ‘‘ఇప్పటికైనా ప్రపంచం నన్ను గుర్తించింది సంతోషం. కోర్టులో కేసు వేసింది కూడా నేనే. పార్లమెంటు అదానీ వ్యవహారంపై వాయిదా పడుతూనే ఉంది. ఏమి జరుగుతుందో చూద్దాం’’ అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

కాగా..ఇటీవల కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిష్‌ను డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ తనిఖీ చేసిన విషయం తెలిసిందే. పవన్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు విసిరారు. అలాగే మంత్రి పయ్యావుల వియ్యంకులపైనా పేర్నినాని పలు ఆరోపణలు గుప్పించారు. స్టెల్లా షిప్‌ను సీజ్ చేయమని చెప్పిన పవన్.. పక్కనే ఉన్న కెన్ స్టార్ షిప్‌ను ఎందుకు సీజ్ చేయమనలేదని ప్రశ్నించారు. కెన్ స్టార్ షిప్ యమాజీన శ్రీను అని.. ఆయన మంత్రి పయ్యావుల వియ్యంకులు కాబట్టే షిప్ జోలికి వెళ్లడం లేదని ఆరోపించారు. కెన్ స్టార్ షిప్‌ను కూడా సీజ్ చేయాలని పేర్నినాని చేసిన వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల పై విధంగా కౌంటర్ ఇచ్చారు.

Also Read : Sheikh Hasina : బంగ్లాలో హిందువుల ఊచకోతల సూత్రధారి యూనస్ పై భగ్గుమన్న హసీనా

Leave A Reply

Your Email Id will not be published!