CM Chandrababu : సీఎం చంద్రబాబును కలిసిన నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్
గ్రామీణ ప్రాంతాలను నాలెడ్జ్ ఎకానమీలో మరింత మెరుగు పరిచేందుకు పూర్తి మద్దతిస్తామని చెప్పారు...
CM Chandrababu : నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి(CM Chandrababu)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురి మధ్య కీలక చర్చ జరిగింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి రుణ పరిమితి పెంచుతున్నట్లు నాబార్డు చైర్మన్ తెలిపారు. రాజధానిలో నాబార్డు ఐకానిక్ భవనాన్ని యేడాదిన్నరలో పూర్తి చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను నాలెడ్జ్ ఎకానమీలో మరింత మెరుగు పరిచేందుకు పూర్తి మద్దతిస్తామని చెప్పారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు సహకారం, మత్స్యరంగం అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు.
CM Chandrababu Meet
స్వయం సహాయక బృందాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు నాబార్డు మద్ధతుగా నిలుస్తుందని షాజీ కృష్ణన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలెప్మెంట్ ఫండ్ కింద పీపీపీ విధానంలో రాష్ట్రవాటాగా వయబిలిటీ గ్యాప్ నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని సీఎం తెలిపారు. ఏపీకి ఆర్ఐడీఎఫ్ కింద అందించే అదనపు కేటాయింపులు, సహకార సంఘాలకు రాయితీలు మరింత అందిస్తామని షాజీ కృష్ణన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో మత్స్యకార రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కోసం ఎఫ్ఐడీఎఫ్ కింద మంజూరైన రూ.450 కోట్ల వినియోగంపైనా సమావేశంలో చర్చ జరిగింది. దేశానికే ఆదర్శవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని నాబార్జు ఛైర్మన్ అభినందించారు. అంతేకాకుండా అమరావతిలో ఐకానిక్ నాబార్డు భవనాన్ని ఏడాదిన్నరలోనే పూర్తి చేస్తామని నాబార్డు ఛైర్మన్ హామీ ఇచ్చారు. నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి విజయవాడకు మార్చడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read : Deputy CM Pawan : మహారాష్ట్ర నయా సీఎంకు అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం