Minister PK Shekhar : మదురై కుంభమేళా పై కీలక అప్డేట్ ఇచ్చిన దేవాదాయ శాఖ మంత్రి

PK Shekhar : మదురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వచ్చే ఏడాది డిసెంబర్‌లో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు హిందూ దేవాదాయ శాఖా మంత్రి పీకే శేఖర్‌ బాబు(PK Shekhar) పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశంలో సోమవారం ఉదయం మాజీ మంత్రి సెల్లూర్‌ రాజు మదురై మహాకుంభాభిషేకం గురించి ప్రశ్నించగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ ప్రాంగణంలోని వీర వసంతరాయర్‌ మండపంలో 2018లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మండపం దెబ్బతిందని దీని పునఃరుద్ధరణకు 25 అడుగుల పొడవైన రాతి స్థంభాల తయారీకి ప్రభుత్వం నుంచి ఇటీవల అనుమతి వచ్చినట్లు తెలిపారు.

Minister PK Shekhar Comments

రాతి స్థంభాల కొనుగోలుకు సంబంధించి రూ.19 కోట్లతో టెండర్లు ఆహ్వానించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని మంత్రి శేఖర్‌ బాబు వివరించారు. మీనాక్షి అమ్మవారి ఆలయంలో చేపట్టిన జీర్ణోద్ధారణ పనులు ఇప్పటి వరకు 63 పూర్తయ్యాయని, వీటిలో 40 పనులు ఉభయదారుల ద్వారా నెరవేర్చినట్లు తెలిపారు.వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ అలయంలో మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు దేవాదాయ శాఖా నిర్ణయించిందని మంత్రి పీకే శేఖర్‌ బాబు తెలిపారు.

Also Read : CM MK Stalin : టంగ్‌స్టన్‌ ప్రాజెక్ట్ అమలైతే తన పదవికి రాజీనామా చేస్తానంటున్న స్టాలిన్

Leave A Reply

Your Email Id will not be published!