CM Revanth Reddy : 3 రోజులు రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటించనున్న తెలంగాణ సీఎం
కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు...
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో రాజస్థాన్ కు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం బయలుదేరనున్నారు. బంధువుల పెళ్లి వేడులకు హాజరయ్యేందుకు జైపూర్ కు వెళ్తున్నారు. గురువారం జైపూర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీకి వెళతారు. 12, 13 తేదీలు.. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి హస్తినలో పర్యటిస్తారు.
CM Revanth Reddy will Visit
కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం (11న) రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అక్కడ కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం ఢిల్లీకి వెళతారు. 12, 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. రెండ్రోజులపాటు దేశ రాజధానిలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులపై కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వనున్నారు.
అలాగేతెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. సీఎంతోపాటు పలువురు మంత్రులూ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. క్యాబినెట్ విస్తరణపై ఆశావహులు ఇప్పటికే ఎదురు చూస్తుండగా.. ఈ అంశం కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈసారైనా దీనిపై స్పష్టత వస్తుందో, లేదో అని కాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు సోమవారం (9వ తేదీ) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, ఈనెల 16వ తేదీకి సభ వాయిదా పడింది. కాగాసోమవారం రాత్రి మంత్రి సీతక్క ఢిల్లీ వెళ్లారు. మంగళవారం రాహుల్ గాంధీతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Also Read : BRS Party : తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణ తరగతులు..బహిష్కరించిన బీఆర్ఎస్