One Nation One Election Bill : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం

కొన్నిరాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి...

One Nation One Election : పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం కీలక సమావేశం జరిగింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రివర్గం ‘ఒక దేశం ఒక ఎన్నికల(One Nation One Election)’ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దీనిని లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. అంతకుముందు ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’పై కోవింద్ కమిటీ నివేదికను సెప్టెంబర్ 18న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 2019లో 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే ఆలోచనను ప్రధాని మోదీ తొలిసారిగా ప్రతిపాదించారు. 2024లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దీనిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

One Nation One Election Bill Updates

2019స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక దేశం ఒకే ఎన్నికలు అనే అంశాన్ని ప్రస్తావించారు. అప్పటి నుంచి చాలా సందర్భాల్లో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు(One Nation One Election)’ అంటూ బీజేపీ మాట్లాడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది ఈ బిల్లు లక్ష్యం. ప్రస్తుతం ఐదేళ్ల వ్యవధిలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. భారత రాజ్యాంగంలో దీనిని ఏర్పాటు చేశారు. దీంతోపాటు వివిధ రాష్ట్రాల శాసనసభల పదవీకాలం వేర్వేరు సమయాల్లో ముగుస్తుంది. దానికగుణంగా ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

కొన్నిరాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం వంటి రాష్ట్రాలు ఉన్నాయి. అదే సమయంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరాం వంటి రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికలు జరగగా, లోక్‌సభ ఎన్నికలు ముగిసిన ఆరు నెలల్లోనే హర్యానా, జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కూడా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇలా ప్రతిసారీ ఎన్నికలు నిర్వహించకుండా దేశం మొత్తం ఒకే సారి ఎన్నికలు నిర్వహించడమే ఈ బిల్లు ఉద్దేశం.

ఏకకాలఎన్నికల సిఫార్సులను రెండు దశల్లో అమలు చేస్తామని కమిటీ తన నివేదికలో పేర్కొంది. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. రెండవ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు (పంచాయత్ మరియు మున్సిపాలిటీ) సాధారణ ఎన్నికలు జరిగిన 100 రోజులలోపు నిర్వహించబడతాయి. దీని కింద అన్ని ఎన్నికలకు ఒకే ఓటరు జాబితాను సిద్ధం చేస్తారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా విస్తృత చర్చకు శ్రీకారం చుట్టనున్నారు. ఇంప్లిమెంటేషన్ గ్రూప్ కూడా ఏర్పడుతుంది.

Also Read : MLA KTR : సీఎం రేవంత్ రెడ్డి వారిపై పెట్టిన కేసులు వాపస్ తీసుకోవాలి

Leave A Reply

Your Email Id will not be published!