Omar Abdullah : ఈవీఎంలపై కాశ్మీర్ సీఎం ‘ఒమర్ అబ్దుల్లా’ సంచలన వ్యాఖ్యలు
లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓడినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు...
Omar Abdullah : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లుపై కాంగ్రెస్ అభ్యంతరాలను జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తోసిపుచ్చాడు. ‘ఇండియా’ కూటమిలో ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) నేషనల్ కాన్ఫరెన్స్ భాగస్వామిగా ఉండటంతో పాటు కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ పార్టీ తరచు ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు బ్యాలెట్ ఎన్నికలకు డిమాండ్ చేస్తోంది. హర్యానా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంల వినియోగంపై మరింత దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. గెలిచినప్పుడు ఎన్నికల ఫలితాలను అంగీకరించినప్పుడు, ఓడిపోయినప్పుడు ఈవీఎంలను తప్పుపట్టరాదని అన్నారు.
Omar Abdullah Comment
”ఇదేఈవీఎంలతో వందకు పైగా ఎంపీలను గెలిచినప్పుడు పార్టీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దినెలలకే ఎన్నికలు ఫలితాలు మీ అంచనాలకు అనుగుణంగా రానప్పుడు ఈవీఎంలు మీకు నచ్చకుండా పోతున్నాయి” అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఓటింగ్ మిషన్లను విశ్వసించనప్పుడు ఎన్నికల్లో పోటీకి పార్టీలు దూరంగా ఉండాలన్నారు. బీజేపీ ప్రతినిధి తరహాలో మీ మాటలు ఉన్నాయని మీడియా అడిగినప్పుడు “అలాంటిదేమీ లేదు.. ఒప్పు ఎప్పుడూ ఒప్పే” అని ఆయన సమాధానమిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓడినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. సిద్ధాంతాల పరంగానే కానీ పక్షపాతంతో తాను మాట్లాడటం లేదని, సెంట్రల్ విస్టా వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుకు తాను సపోర్ట్ చేశానని విషయాన్ని గుర్తు చేసారు. ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు మంచిదేని, అలాగే కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం చాలా మంచి ఆలోచన అని తాను నమ్ముతానని అన్నారు. పాత పార్లమెంటు భవనం మనుగడ కాలం తగ్గినందున కొత్త పార్లమెంటు భవనం అవసరం ఉందని చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా అసంతృప్తితో ఉన్నారంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా తాజా వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ పెద్దగా దృష్టి పెట్టకుండా తమపైనే ఎక్కువగా కాంగ్రెస్ ఆధారపడిందని పలువురు ఎన్‌సీ నేతలు సైతం వ్యాఖ్యానించారు. 90 మంది సభ్యుల జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఎన్‌సీ 42 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 6 సీట్లు దక్కించుకుంది.
Also Read : Deputy CM Bhatti : బీఆర్ఎస్ నేతలకు చర్చకు సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి