Arvind Kejriwal :సీఎంలు చంద్రబాబు, నితీష్ లకు ప్రశ్నలు సంధించిన కేజ్రీవాల్

ఇటీవల వరుసగా రెండు రోజుల పాటు రాజ్యాంగంపై పార్లమెంట్ లో జరిగింది...

Arvind Kejriwal : దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో కేంద్ర మంత్రి అమిత్ షా.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలని.. అలాగే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, పాదయాత్రలు సైతం చేపట్టాయి. అలాంటి వేళ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) గురువారం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా ఎన్డీయే మిత్ర పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) అధినేతలకు ఆయన సూటిగా ప్రశ్నను సంధించారు. దేశ ప్రజలు గౌరవనీయులైన నితీష్ జీ, చంద్రబాబు నాయుడు జీని అడగాలనుకుంటున్నారు – “అమిత్ షా జీ చేసిన బాబా సాహెబ్‌ను అవమానించడాన్ని మీరు సమర్థిస్తారా?” అంటూ ఎక్స్ తన ఖాతా వేదికగా వారిరువురిని మాజీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) హిందీలో ప్రశ్నించారు.

Arvind Kejriwal Comments

ఇటీవల వరుసగా రెండు రోజుల పాటు రాజ్యాంగంపై పార్లమెంట్ లో జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అనడం నేడు ఫ్యాషన్ అయిపోయింది. అదే దేవుడి పేరును అన్ని సార్లు తలుచుకొంటే.. స్వర్గంలో సద్గతి ప్రాప్తిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో అమిత్ షా వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. అంతేకాదు.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. అలాగే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని సైతం డిమాండ్ చేశాయి.

మరోవైపు అమిత్ షా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. బీఆర్ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాల అవమాన పరిచిందన్నారు. ఆ విషయాలను అమిత్ షా బహిర్గతం చేసేందుకు యత్నించారన్నారు. అలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీ ఈ తరహా దాడికి దిగిందంటూ ఆ పార్టీపై ప్రధాని మోదీ.. తన ఎక్స్ ఖాతా వేదికగా ఎదురు దాడికి దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడి అధికారంలో ఉన్నా.. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదని గుర్తు చేశారు.

అదే విధంగా పార్లమెంటులో డాక్టర్ అంబేద్కర్‌ను అవమానించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ చీకటి చరిత్రను అమిత్ షా బట్టబయలు చేశారని.. ఈ సందర్బంగా ఆయన సమర్పించిన వాస్తవాలను చూసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారని చెప్పారు. అందుకే ప్రస్తుతం ఆ పార్టీ నేతలు నాటకాలాడుతున్నారని ఆరోపించారు. అయితేప్రజలకు మాత్రం నిజం తెలుసున్నారు. ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం కాంగ్రెస్ చేయలేదన్నారు. అలాగే పండిట్ నెహ్రూ సైత.. అంబేద్కర్ ఓటమి కోసం పని చేశారని గుర్తు చేశారు. అలాగే భారతరత్న సైతం అంబేద్కర్ కు నిరాకరించారని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా వరుస ట్విట్లతో వివరించారు.

Also Read : Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్ కుల్గాం ఎన్కౌంటర్లో 5 ఉగ్రవాదుల హతం

Leave A Reply

Your Email Id will not be published!