Ravichandran Ashwin : తమ కొడుకుని టార్చర్ చేసారంటూ అశ్విన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
అశ్విన్ రిటైర్మెంట్‌కు చాలా కారణాలు ఉండొచ్చునని....
Ravichandran Ashwin : దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టే తన కెరీర్‌లో చివరిది అని ప్రకటించాడు. మంచి ఫామ్, ఫిట్‌నెస్, ఇంకొన్నేళ్ల పాటు ఆడే సత్తా ఉన్నా అతడు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంపై అభిమానులు సీరియస్ అవుతున్నారు. మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వు.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమంటూ అతడ్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నీ అవసరం టీమ్‌కు ఉందని చెబుతున్నారు. ఈ తరుణంలో అశ్విన్(Ravichandran Ashwin) రిటైర్మెంట్‌పై అతడి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు.వాళ్లు వేధించడంతోనే తన కుమారుడు టీమ్ నుంచి తప్పుకున్నాడని అన్నాడు. వారు పెట్టిన ఒత్తిడి వల్లే అతడు రిటైర్ అయ్యాడని చెప్పాడు.
Ravichandran Ashwin Father Comments Viral
అశ్విన్ రిటైర్మెంట్‌కు చాలా కారణాలు ఉండొచ్చునని.. అవి ఏంటనేది కేవలం అతడికే తెలియాలని రవిచంద్రన్ చెప్పుకొచ్చాడు. అతడ్ని టార్చర్ పెట్టారన్నాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వేధింపులు సహించాలనే ఫ్రస్ట్రేషన్‌లోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకొని ఉండొచ్చన్నాడు. తన కొడుకును చాన్నాళ్లుగా హింసిస్తున్నారని.. అతడు రిటైర్మెంట్ తీసుకుంటాడనే భయం తనకు ఉందని.. ఇప్పుడు అదే నిజమైందన్నాడు. వేధింపులు సహించలేకే అతడు ఈ నిర్ణయానికి వచ్చాడని తెలిపాడు. అయితే అశ్విన్(Ravichandran Ashwin)ను ఎవరు వేధించారు? టీమ్ మేనేజ్‌మెంటా? లేదా సహచర ఆటగాళ్లా? బీసీసీఐ పెద్దలా? సెలెక్టర్లా? అనేది మాత్రం రవిచంద్రన్ బయటపెట్టలేదు.
‘అశ్విన్ రిటైర్మెంట్ గురించి నాకు ఆలస్యంగా తెలిసింది. అతడి మైండ్‌లో ఏం నడుస్తోందో నాకూ తెలియదు. అతడు అనౌన్స్ చేశాడు.అతడు రిటైర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. కానీ అతడి నిర్ణయానికి ఒప్పుకోక తప్పలేదు. ఎంతో ఒత్తిడి మధ్య నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. నేనేమీ బాధపడటం లేదు. కానీ అతడు రిటైర్మెంట్ గురించి ప్రకటించిన తీరుపై ఒకింత సంతోషం కలిగించినా, ఎక్కువగా బాధకు గురిచేసింది. ఎందుకంటే అతడు ఇంకొన్ని సంవత్సరాలు ఆటలో కొనసాగాల్సింది. రిటైర్ అవ్వాలని అతడు అనుకుంటే నేను ఏమీ చేయలేను. కానీ అతడు నిర్ణయాన్ని ప్రకటించిన తీరు బాలేదు. ఎక్కడో ఏదో జరిగింది’ అని అశ్విన్ తండ్రి రవిచంద్రన్ అనుమానాలు వ్యక్తం చేశాడు.
Also Read : MP Raghunandan Rao : కాంగ్రెస్ అంబేద్కర్ వారసులమని చెప్పే ప్రయత్నం చేస్తుంది