Puja Khedkar : మాజీ ఐఏఎస్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
యూపీఎస్‌సీని మోసం చేసేందుకు ఉద్దేశించిన కేసుగా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టు హైకోర్టు పేర్కొంది...
Puja Khedkar : యూపీఎస్‌సీ మోసం చేసిన కేసులో వివాదాస్పద ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిలు కోరుతూ ఆమె చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్టు చేయకుండా ఆమెకు కల్పించిన ఇంటెరిమ్ ప్రొటక్షన్‌ను కూడా తొలగించింది.పరీక్షల నిర్వహణకు సంబంధించి యూపీఎస్‌సీ ప్రతిష్టాత్మక సంస్థ అని జస్టిస్ చంద్ర ధారి సింగ్ పేర్కొంటూ పూజా ఖేడ్కర్(Puja Khedkar) ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు. దీంతో ఆమెకు కల్పించిన ఇంటెరిమ్ ప్రొటక్షన్ కూడా తొలగిపోయింది.
Puja Khedkar Bail…
యూపీఎస్‌సీని మోసం చేసేందుకు ఉద్దేశించిన కేసుగా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టు హైకోర్టు పేర్కొంది. నకిలీ పత్రాల ద్వారా ప్రయోజనాలు పొందటం చట్టబద్ధత కాదని, పిటిషనర్ తల్లిదండ్రులు ఉన్నతమైన పొజిషన్లలో ఉన్నందున వ్యక్తులను ప్రభావితం చేసే ఆవకాశం ఉందని అభిప్రాయపడింది. కాగా, విచారణకు తన క్లయింట్ సిద్ధంగా ఉందని, అందువల్ల ఇంటరాగేషన్ అవసరం లేదని ఖేడ్కర్(Puja Khedkar) తరఫు న్యాయవాది బినా మాధవన్ తన వాదన వినిపించారు. అయితే, విచారణ జరుగుతున్నందున దీని వెనుక ఉన్న అతిపెద్ద కుట్రను వెలికితీయాలంటే కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమవుతుందని ఢిల్లీ పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ సంజీవ్ భండారి వాదించారు. కుట్రలోని కొన్ని కోణాలను ఇంకా పరిశీలించాల్సి ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇంతకుమందు కూడా ముందస్తు బెయిలును ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు.
పుణెలోట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె తప్పుడు అఫిడవిట్‌లతో యూపీఎస్‌సీ పరీక్షలను క్లియర్ చేసినట్టు వెలుగుచూడటంతో చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన యూపీఎస్‌సీ ఆ ఆరోపణలు నిజమని కనుగొనడంతో షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఫోర్జరీ కేసు నమోదు కావడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతో పాటు భవిష్యత్‌లో పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది. యూపీఎస్‌సీ నిర్ణయాన్ని హైకోర్టులో ఖేడ్కర్ సవాలు చేశారు. తనపై అనర్హత వేటు వేసే అధికారం యూపీఎస్‌సీకి లేదని, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)కు మాత్రమే ఉందని ఆమె వాదించారు. ఈ క్రమంలో కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటవి సర్వీసు నుంచి తొలగించింది.
Also Read : Allu Arjun : బన్నీ కేసుపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్సీని కలిసిన మామ