AP High Court : మాజీ మంత్రి పిటిషన్ విచారణకు అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు

ఈ కేసుకు బయటకు వచ్చినప్పటి నుంచి పేర్నినాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది...

AP High Court : గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్ట్‌(AP High Court)లో మంగళవారం విచారణ జరిగింది. విచారణకు హాజరుకావాలంటూ మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది. అయితే ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని న్యాయమూర్తి గుర్తుచేశారు. గడువు ముగిసిన నేపథ్యంలో పిటిషన్ విచారణపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని, తిరిగి పోలీసులు నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు ఇవ్వాలని న్యాయస్థానాన్ని న్యాయవాదులు అభ్యర్థించారు. అందుకు న్యాయమూర్తి అంగీకారం తెలిపారు. మచిలీపట్నంలో వైసీపీ నేత పేర్నినాని(Perni Nani) సతీమణి జయసుధ మచిలీపట్నంలోని తన గోడౌన్‌ను పౌరసరఫరాలశాఖకు లీజుకిచ్చారు. అయితే ఇందులో నిల్వ చేసిన రేషన్ బియ్యం మాయం అయ్యాయని పేర్కొంటూ చింతం కోటిరెడ్డి అనే అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు.

AP High Court Comment

కాగా..కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట ఉన్న గోదాముల్లో రేషన్‌ బియ్యం మాయమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో సుమారు 187 టన్నుల పీడీఎస్‌ బియ్యం అక్రమంగా తరలించినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు బయటకు వచ్చినప్పటి నుంచి పేర్నినాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. గత పది రోజులుగా పేర్ని నాని సతీమణి జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం పేర్నినాని బయటకు వచ్చి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్‌పై క్లారిటీ వచ్చే వరకు పేర్నినాని సతీమణిని బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు పేర్నినాని భార్యపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఇటీవల పేర్నినాని కుటుంబానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు సహకరించాల్సిందిగా పేర్నినాని ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే పేర్నినాని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులను అంటించారు. నోటీసులను పేర్నినాని చూడకపోవడంతో మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు చెబుతున్నారు.

Also Read : Minister Kumaraswamy : కాంగ్రెస్ మాటలన్నీ తప్పు..వాళ్ళు హాసన్ జిల్లాకు చేసిందేమీ లేదు

Leave A Reply

Your Email Id will not be published!